ఆస్కార్ 2012: పాఠకులకు విజేతల వివరాలు
లాస్ ఏంజిల్స్: యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డుల వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ప్రముఖ హాస్య నటుడు బిల్లీ క్రిస్టేల్ చేతుల మీదగా ప్రారంభం అయింది. ప్రపంచం మొత్తం ఈ వేడుకలకు సిద్దమైంది. ఆదివారం రోజున ఈ బంగారపు బొమ్మను సొంతం చేసుకునే అదృష్టవంతులెవరో తెలుసుకోవడానికి అందరూ టీవికి అందరూ అతుక్కు పోయారు.
84వ ఆస్కార్ అవార్డుల వేడుకకు లాస్ ఏంజిల్స్ కొడాక్ ధియేటర్ అంగంగ వైభవంగా ముస్తాబైంది. ఇప్పటి వరకు విడుదల చేసిన ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో హ్యూగో చిత్రం రికార్డు స్దాయిలో నాలుగు ఆస్కార్ అవార్డులను దక్కించుకుంది. హ్యూగో చిత్రానికి గాను సినిమాటోగ్రఫీ, కళా దర్శకత్వం, సౌండ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో ఆస్కార్ అవార్డుని దక్కించుకుంది.
ఉత్తమ దర్శకుల విభాగంలో మైకేల్ హజనవిసియస్ (ది ఆర్టిస్ట్) సినిమాకు గాను ఆస్కార్ అవార్డుని దక్కించుకున్నారు. ఈ కేటగిరిలో అలెగ్జాండర్ పేనె (ది డిసెండెంట్స్), మార్టిన్ స్కోర్‌సెసె (హ్యూగో), వూడీ అలెన్ (మిడ్‌నైట్ ఇన్ పారిస్), టెర్రెన్స్ మల్లిక్ (ది ట్రీ ఆఫ్ లైఫ్)లు పోటీపడినప్పటికీ... రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందిన నలుపు-తెలుపు చిత్రం 'ది ఆర్టిస్ట్'. మైఖేల్ హజనవిసియస్ ప్రతిభకు ఈ చిత్రం ఓ నిదర్శనం అని హాలీవుడ్ వర్గాలు కితాబులిచ్చేశాయి.
ఉత్తమ నటుడు అవార్డుని ది ఆర్టిస్ట్ సినిమాలో నటించిన నటనకు గాను జీన్ డుజార్డిన్ దక్కించుకున్నారు. అదే విధంగా ఉత్తమ నటి అవార్డుని మేరల్ స్టీప్ దక్కించుకున్నారు. ది ఐరన్ లేడి సినిమాలో ఆమె నటన అద్బుతం. ఇక ఉత్తమ సహాయనటి, ఉత్తమ సహాయనటుడు విభాగాలలో మొత్తం ఐదుగురు పోటీ పడినప్పటికీ ఉత్తమ సహాయనటి విభాగంలో ఆక్టేవియా స్పెన్సర్ ఆస్కార్ అవార్డ్‌ని దక్కించుకున్నారు. చూడాడనికి సుమారుగా ఉన్నప్పటికీ ది హెల్ప్ సినిమాలో ఆక్టేవియా స్పెన్సర్ చేసిన అభినయం వర్ణాతీతం అంటున్నారు ప్రేక్షకులు. ది హెల్ప్ సినిమాలో మిన్నీ జాక్సన్ అనే పాత్రలో చేసిన నటనకు గాను ఆక్టేవియా స్పెన్సర్ ఆస్కార్‌ని పొందారు.
ఆస్కార్ అవార్డుల విజేతల వివరాలు:
ఉత్తమ చిత్రం: ధామస్ లాంగ్ మ్యాన్(ది ఆర్టిస్ట్)
ఉత్తమ దర్శకుడు: మైఖెల్ హాజనావికస్(ది ఆర్టిస్ట్)
ఉత్తమ నటుడు: జీన్ డుజార్డిన్(ది ఆర్టిస్ట్)
ఉత్తమ నటి: మేరల్ స్ట్రీప్(ది ఐరన్ లేడి)
ఉత్తమ సహాయ నటుడు: క్లిస్టోఫర్ ప్లమ్మర్(బిగినర్స్ )
ఉత్తమ సహాయ నటి: ఆక్టావియా స్పెన్సర్ (ది హెల్ప్)
ఉత్తమ ఆర్ట్ డైరెక్షన్: హ్యూగో
యానిమేటెడ్ ఫీచర్: ఫిల్మ్ రాంగో
ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ఏ సపరేషన్ (ఇరాన్)
ఫిల్మ్ ఎడిటింగ్: ది గర్ల్ విత్ డ్రాగన్ టాటూ(కిర్క్ అండ్ ఆంగూస్ వాల్)
మేకప్: ది ఐరన్ లేడి(మార్క్ కోలర్, జే రాయ్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: రాబర్డ్ రిచర్డ్సన్ (హ్యూగో)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: మార్క్ బ్రిడ్జెస్ (ది ఆర్టిస్ట్)
ఉత్తమ మేకప్: మార్క్ కౌలియర్ , జే రాయ్ హేలాండ్ (ద ఐరన్ లేడీ)
మ్యూజిక్(ఓరిజనల్ స్కోర్): లుడవిక్ బోర్స్(ది ఆర్టిస్ట్)


Click it and Unblock the Notifications











