ప్రముఖ హాలీవుడ్ స్క్రిప్ట్ రైటర్, దర్శకురాలు మృతి
హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ సినిమాలు అంటే టక్కున గుర్తొచ్చే పేరు నోరా ఎప్రాన్. స్క్రీన్ రైటర్,దర్సకురాలు అయిన నోరా ఎప్రాన్ ఈ రోజు తన 71 ఏట మరణించారు. ఆవిడ గత కొంత కాలంగా లుకేమియా వ్యాధితో భాధపడుతున్నారు. వెన్ హ్యారీ మెట్ షాలీ,స్లీప్ లెస్ ఇన్ సియాటిల్,యు హ్యావ్ గాట్ ఎ మెయిల్ వంటి చిత్రాలు ఆమె కెరీర్ లో ఆణిముత్యాలు వంటివని చెప్తూంటారు. ఆమె చిత్రాల ప్రేరణతో మన దేశంలోనూ అనేక సినిమాలు వచ్చాయి.
కాలిఫోర్నియాలో పెరిగిన ఈ రచయిత్రి అక్కడే న్యూ యార్క్ పోస్ట్ లో రిపోర్టర్ గా తన కెరీర్ ని ప్రారంభించింది. ఆమెను ఆ పత్రిక బ్రిలియెంట్ రైటర్ గా అభివర్ణించింది. ఆమె తన రచనలతో,సినిమాలతో ఎంతో మందికి ఆనందాన్ని ఇచ్చింది అని తమ సంతాప సందేశంలో తెలియచేసారు.
ఇక ఆమె పదిహేను సినిమాలకు పనిచేసారు. జూలీ అండ్ జూలియా ఆమె చివరి సినిమా. 2009లో ఈ చిత్రం వచ్చిన తర్వాత ఆమె లుకేమియా బారిన పడ్డారు. అప్పటినుంచి ఆమె ఏ సినిమాకూ పనిచేయలేదు. ఆమె మూడు సార్లు ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. కానీ ఎప్పుడూ ఆస్కార్ అవార్డుని అందుకోలేదు.
ఇక ఆమె సినిమా స్లీప్ లెస్ ఇన్ సియాటిల్,యు హ్యావ్ గాట్ మెయిల్ చిత్రాల్లో నటించిన టామ్ హ్యాంక్స్ మాట్లాడుతూ..చాలా విచారంగా ఉంది. మంచి మిత్రురాలు ఆవిడ మాకు. ఆవిడతో పనిచేసిన మేమంతా అదృష్టవంతులం అన్నారు. ఆవిడ సెట్ మీద గానీ, డిన్నర్ టేబుల్ మీద కానీ ఎప్పుడూ ఉత్సాహంగా ఉంది. మాలో ఉత్తేజాన్ని నింపేది. అలాంటి వ్యక్తులు చాలా అరుదు అని సంతాపం వెళ్లబుచ్చారు. ఇక ఎప్రాన్ సినిమాలకే కాక పత్రికలకు చాలా ఆర్టికల్స్ రాసింది. నాన్ ఫిక్షన్ పుస్తకాలు సైతం రాసింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ధట్స్ తెలుగు ప్రార్దిస్తోంది.


Click it and Unblock the Notifications











