ఇంగ్లీషు సినిమాలో నటించడం చాలా కష్టంగా ఉంది: క్రజ్
లండన్: స్పానిష్ హీరోయిన్ పెనెలోప్ క్రజ్ ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ ఇంగ్లీషు సినిమాలో నటించడం చాలా కష్టంగా ఉందని.. ప్రతిసారి డైలాగ్స్ కోసం ఆలోచించాల్సి వస్తుందని అన్నారు. ఇంగ్లీషులో నటించడం వల్ల నేను యాక్టింగ్ చేస్తున్న సందర్బంలో నా మెదడు స్టాప్ అవతుందన్నారు. ప్రతి సన్నివేశంలో కూడా డైలాగ్స్ గురించి ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే నేను స్పానిష్ అమ్మాయిని కాబట్టి, ఇంగ్లీషు డైలాగ్స్ నా మెదడులో త్వరగా రావడం లేదు.
మనం ఎప్పుడైనా పరబాషా చిత్రంలో నటిస్తున్నప్పుడు పదాల గురించి ప్రతి సెకనుకొకసారి ఆలోచించాలి. ఇది చాలా కష్టంగా ఉంది. అయినా నేను చక్కగానే చేశాను. 36 సంవత్సరాల వయసు కలిగిన పెనెలోప్ క్రజ్‌కి 18 సంవత్సరాల వయసు కలిగిన లియో అనే కుమారుడు ఉన్నాడు. పెనెలోప్ క్రజ్ భర్త జేవియర్ బార్డమ్ పేరు మోసిన పెద్ద స్టార్ హీరో.
పెనెలోప్ క్రజ్ నటించిన 'వికీ క్రిస్టినా బార్సిలోనా' సినిమాలో ఇంగ్లీషు స్కిప్ట్‌ని తమ భాష స్పానిష్ లోకి తజ్జుమా చేయించుకున్నారు. ఇందు కోసం ఈ సినిమా డైరెక్టర్ వూడీ అలెన్ స్పానిష్ నేర్చుకోవాలని తెగ ప్రయత్నాలు చేశారని తెలిపింది. ఇంగ్లీషు స్కిప్ట్‌ని స్పానిష్‌లోకి అనువదించడానికి డైరెక్టర్ వూడీ అలెన్ చేసిన కృషి అభినందనీయమని పెనెలోప్ క్రజ్ భర్త జేవియర్ బార్డమ్ పేర్కొన్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











