నటన నాకు జీవితపు పాఠాలు నేర్పింది: విల్ స్మిత్
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ నటుడిగా తన జీవితంలో విలువైన జీవితపు పాఠాలను నేర్చుకున్నానని తెలిపాడు. ప్రతి ఒక్కరితో మాడ్లడడానికి ఒక దౌత్య పద్దతిలో మాట్లాడే విధానాన్ని అలవర్చుకున్నట్లు తెలిపాడు. కొన్ని సందర్బాలలో ఎవరినైతే తాను ద్వేషించాడో వారితో కూడా ఆప్యాయంగా మట్లాడడం వల్ల జీవితంలో అందరిని ప్రేమించే గుణం అలవాటు చేసుకోవచ్చునని అన్నాడు.
నాతో కలసి పని చేసే ప్రతి ఒక్కరితో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడంతో పాటు కలసి మెలసి ఉంటానని.. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరి నుండి ఏదో కాస్తా కూస్తో మంచి చెడుని గమినించే అవకాశం కలుగుతుందని అన్నాడు. ఇప్పుడు భూమిపై ఉన్న 98 శాతం ప్రజలను ఏ పరిస్దితిలో ఉన్నా మేనేజ్ చేస్తాననే నమ్మకం నాకుందని అన్నాడు.
చివరగా మాట్లాడుతూ... ఐతే ఇక్కడ కొంత మంది పిచ్చి వాళ్లు ఉన్నారు.. వారితో మీరు ఏమీ చేయలేరని సరదాగా వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











