ఆమెతో బంధం బలపడేందుకు గిప్ట్ ఖర్చు $5,000
లండన్: హాలీవుడ్ స్టార్ హీరో ఆస్టన్ కుచర్ తనతో పాటు "దట్ 70's షో" కో స్టార్ అయిన మిలా కునిస్‌కు ఖరీదైన ఫోన్ కేసుని గిప్ట్‌గా అందించాడు. దీని విలువ సుమారుగా $5,000 ఉంటుందని సమాచారం. ఈ గిప్ట్‌ని మిలా కునిస్‌కి ఇవ్వడంతో వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ మరింత బలపడుతుందని అందరూ భావిస్తున్నారు.
ఈ విషయాన్ని నేషనల్ ఎంక్వైరియర్ మ్యాగజైన్ వారు వెల్లడించారు. మిలా కునిస్ యొక్క మనసు దోచుకునేందుకు గాను ఆస్టన్ కుచర్ 5,000 బగ్స్ ఖర్చుపెట్టారని.. పార్టీ అనంతరం వీరిద్దరూ ముద్దు పెట్టుకుంటుండగా చూశామని అందులో తెలిపింది. ఇటీవలే తన ఆస్టన్ కుచర్ తన భార్య డెమి మోరి నుండి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
భార్య భర్తలు విడిపోయిన తర్వాత హాలీవుడ్లో మరో జంటతో ఎంజాయ్ చేయడం సధారణ విషయం. సరిగ్గా ఇలాంటి సంఘటనే వీరిద్దరి విషయంలో కూడా సంభవించింది. ఆస్టన్ కుచర్ తన భార్యకి విడాకులు ఇచ్చిన తర్వాత స్క్రీన్ రైటర్ 'లోరెని స్కాఫారియా'తో కలసి డేటింగ్ చేస్తున్నారని సమాచారం.
33 సంవత్సరాలు వయసు కలిగిన ఆస్టన్ కుచర్ 2011 క్రిస్‌మస్ సంబరాలను కొత్త గర్ల్ ప్రెండ్ 'లోరెని స్కాఫారియా'తో కలసి ఇటలీలో జరుపుకోవడమే కాకుండా, ఇటలీలో ఉన్న ఫేమస్ పీసా టవర్‌ని దర్శించినట్లు ఈ జంటను చూసిన సందర్శకులు చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలసి 'పిజ్జారియా ట్రటోరియా తోస్కానా'లో రొమాంటిక్ లంచ్ చేశారు. ఆనోటా.. ఈనోటా పాకి చివరికి ఈ వార్త ఆస్టన్ కుచర్ వద్దకు చేరగా.. ఈ రొమాంటిక్ రూమర్‌పై తనదైన శైలిలో స్పందించాడు. ఈ వార్తలన్నీ కూడా నాపై బురద చల్లేందుకే పుట్టిస్తున్నారని అన్నారు. అసలు నాకు, 'లోరెని స్కాఫారియా'తో ఎటువంటి సంబంధం లేదని అన్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











