twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ కు కొరడా దెబ్బలు, జైలు శిక్ష

    By Srikanya
    |

    ఇరానియన్ నటి మార్జియా ..ఇరానియన్ సాంప్రదాయాల పై తీవ్రంగా విమర్శలు చేస్తూ “మై తెహ్రాన్ ఫర్ సెల్ “ అనే సినిమా తీసారు. ( తెహ్రాన్, ఇరాన్ రాజధాని ) ఓ నటిగా ఇరాన్ లో ఎలా నెగ్గుకువచ్చింది అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాకు సూత్రధారి, పాత్రధారి మార్జియానే. అయితే మతపెద్దలు, సెన్సార్ ఈ సినిమా రిలీజ్ కు అంగీకరించలేదు. కాని సినిమా మాత్రం సీక్రెట్ గా విడుదల అయియంది. దీంతో మొన్న జులై లో మార్జియా ను జైల్లో పెట్టారు. ఆమె తరుపు లాయర్ కూడా ఏమీ చేయలేకపోవటంతో ఈ శిక్ష ప్రకటించారు. తొంభై కొరడా దెబ్బలతో పాటు సంవత్సరం జైలు కూడా ఆమెకు విధించారు. ఈ విషయం వారి దేశం అంతర్గత చట్టాల పరిధుల్లోకి రావటంతో మానవ హక్కుల సంఘాలు వారు కూడా చేతులెత్తేసే పరిస్దితి వచ్చేసింది.

    అయితే ఐక్యరాజ్య సమితి వారు ఈ విషయంలో కలగచేసుకుని ఆమెకు న్యాయం జరిపిస్తుందని ఆశిస్తున్నామని ఆమె తరుపు పెట్టుకున్న లాయిర్ అంటున్నారు. ఇక ఈ చిత్రంలో కళ అనేది దేశం కంట్రోల్లో ఎలా నలిగిపోతోందో చూపెట్టటమే తప్పై పోయింది. గవర్నమెంట్ బ్యాన్ పెట్టిన వర్క్ ని ప్రదర్శించమే తప్పని అక్కడ ప్రభుత్వం అంటోంది. ఇక ఈ చిత్రంలో ప్రధానంగా అక్కడ యువత సీక్రెట్ జీవితాన్ని చూపటం జరిగింది.ఇక ఈ చిత్రం అఫీషయల్ గా ఆ దేశంలో ఎక్కడా స్క్రీనింగ్ జరగలేదు కానీ...2009 లోని ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు.

    English summary
    An IRANIAN Actor has been sentenced to one year in prison and 90 lashes for her starring role in Australian film My Tehran for Sale.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X