కాబోయే భార్యకు ఖరీదైన పెళ్లి కానుక
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ తనకి కాబోయే భార్య ఏంజిలీనా జోలీ కోసం పెళ్లి కానుకగా $390,000 విలువ కలిగిన ఖరీదైన వాచ్‌ని గిప్ట్‌గా ఇవ్వనున్నాడని సమాచారం. గత ఏప్రిల్‌లో పిట్, జోలీ జంటకు నిశ్చతార్దం అయిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి వివాహాం సెప్టెంబర్ లో జరగనుంది. బ్రాడ్ పిట్, జోలీ కోసం ఆర్డర్ చేసిన లగ్జరియస్ పాటెక్ ఫిలిప్పీ మినిట్ రిపీటర్ వాచ్ కనీసం కస్టమర్‌కు అందాలంటే రెండు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది.
జెనీవాలో ప్రధాన కేంద్రంగా తయారవుతున్న ఈ పాటెక్ ఫిలిప్పీ వాచ్‌ని స్టెర్న్ కుటుంబానికి చెందిన ప్రతి ఒక్క మెంబర్ చెక్ చేయాల్సి ఉంది. ఎందుకంటే పాటెక్ ఫిలిప్పీ కంపెనీ స్టెర్న్ కుటుంబానిది కాబట్టి. బాసిల్‌లో ఒకానోక కార్యక్రమంలో స్టెర్న్ కుటుంబాన్ని అనుకోకుండా కలుసుకున్న బ్రాడ్ పిట్ ఈ అద్బుతమైన వాచ్‌ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించాడని పాటెక్ ఫిలిప్పీ వాచ్ కంపెనీ వర్గాలు తెలిపాయి.
కొంత మందికి మాత్రమే ప్రత్యేకంగా తయారు చేసే పాటెక్ ఫిలిప్పీ వాచ్ కంపెనీ బ్రాడ్ పిట్ కోసం ప్రత్యేకంగా ఏంజెల్ మాదిరి ఉండే వాచ్‌ని రూపొందిచారు. అత్యంత అధునాతన టెక్నాలజీతో తయారైన ఈ వాచ్‌ని బ్రాడ్ పిట్ తన ప్రేయసి జోలీకి పెళ్లి కానుకగా అందివ్వనున్నాడు. ఈ వాచ్ బంగారంతో తయారు చేయడంతో పాటు ఒక ముత్యపు డయల్‌ని ఇందులో భద్రపరిచారు. ఇక ఈ వాచ్‌ని చేయడానికి గాను రెండు నెలలు సమయం తీసుకున్నారు. బ్రాడ్ పిట్ స్వయంగా జెనీవా వెళ్లి ఈ వాచ్‌ని తీసుకోని... వెడ్డింగ్ గిప్ట్‌గా ఏంజిలీనా జోలీకి అందజేయనున్నాడు.
ఏంజిలీనా జోలీ, బ్రాడ్ పిట్ జరుపుకున్న వివాహం వేడుక ప్రజలకు వివిధ మార్గాల్లో ప్రతిబింబించాలని కోరుకుంటున్నారు. ఏంజిలీనా జోలీ ముగ్గురు పిల్లలకు జన్మనివ్వగా.. మరో ముగ్గురిని దత్తతు తీసుకున్న విషయం తెలిసిందే. కంబోడియా నుండి 10 సంవత్సరాల వయసు కలిగిన మాడక్స్, ఎధోపియా నుండి 7 సంవత్సరాల వయసు కలిగిన జహారాను, వియత్నాంకు చెందిన 9 సంవత్సరాల బాలుడు పాక్స్‌ని దత్తతు తీసుకుంది. వీరిద్దరూ గత ఏడు సంవత్సరాలుగా కలిసి సహాజీవనం సాగిస్తున్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











