'పాట కచేరి'లతో ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్..!
లండన్: త్వరలో ఒక ఇంటి వారు కాబోతున్న బ్రాడ్ పిట్ మరియు అతని భాగస్వామి ఏంజెలీనా జోలీ ప్రస్తుతం కచేరీ సెషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకోసం గాను ఇటీవలే ఈ జంట ఇటీవలే ఒక థియేటర్ కంపెనీని అద్దెకు తీసుకున్నారు. దీనితో బ్రిటన్‌లో వారి ఇంటిని సందర్శించడానికి వచ్చే వారిని తమ యొక్క గాత్ర నైపుణ్యాలతో అలరించనున్నారు. అంతేకాకుండా తమ ఆరుగురు పిల్లలు పాక్స్, నాక్స్, వివిన్నే, షైలో, మాడక్స్, జహారాలు మైక్రోఫోన్‌ని ఎంచుకునేటప్పుడు నిర్బయంగా ఉంటారని తెలిపారు.
థియేటర్ కంపెనీతో కలిసి బ్రాడ్ పిట్ పిల్లలు ముందు ఒక రాగాన్ని ఆలపించాడు. ఏంజెలీనా మాత్రం పిల్లలు గానం చేసేందుకు థియేటర్ గ్రూప్ఒక ఆహ్లాదకరమైన మార్గంగా ఉపయోగపడుతుందని తెలిపింది. తాము లండన్లో ఉన్నంత కాలం దీనిని పిల్లలు తప్పని సరిగా సాధన చేస్తే ప్రయోజనం ఉంటుందని బ్రాడ్ భావించాడు. పిల్లలు వాళ్లకి నచ్చిన పాప్ సాంగ్స్‌ని బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీలతో కలసి పాడి ఎంజాయ్ చేశారు.
36 సంవత్సరాలు వయసు కలిగిన ఏంజిలీనా జోలీ, బ్రాడ్ పిట్ ఇద్దరూ త్వరలో వివాహాం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఏంజిలీనా జోలీ 1 మిలియన్ పౌండ్స్ ని ఖర్చు చేసి మరీ ఈ హెలికాప్టర్‌ని కొనుగోలు చేసి బ్రాడ్ పిట్‌కు గిప్ట్ గా అందివ్వనుంది. దీని కోసం ప్రత్యేకించి దక్షణ ఫ్రాన్స్ చాటూ మిరావల్‌లో ఉన్న ఇంట్లో హెలికాప్టర్ ప్యాడ్‌ని ఇప్పటికే సిద్దం చేసింది. ఈ విషయంపై స్పందించిన జోలీ ఈ గిప్ట్‌ని బ్రాడ్ పిట్‌కి ప్రజెంట్ చేస్తే ఆశ్చర్యపడతాడని తెలిపింది.


Click it and Unblock the Notifications











