పెళ్లి రోజున అతిథులకు సూపర్ స్టార్ చేతితో తయారుచేసిన వైన్
పారిస్: హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ ఈ సెప్టెంబర్‌లో ఒక ఇంటివారు కాబోతున్న విషయం తెలిసిందే. పిట్, జోలీల పెళ్లి రోజు సందర్బంగా ఫ్రాన్స్‌లోని మిరావల్ ఎస్టేట్‌లో బ్రాట్ పిట్‌కు ఎంతో ఇష్టమైన, తనకి నచ్చిన వైన్ బ్రాండ్‌ని పానీయంగా అందించనున్నాడు. బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ ఇద్దరూ ఫ్రాన్స్‌లోని మిరావల్ ఎస్టేట్‌లో ఆత్మీయులు, స్నేహితులు మధ్య సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
దీని కోసం ఇప్పటి నుండి పూర్తి ఏర్పాట్లలో నిమగ్నమైన బ్రాడ్ పిట్ తన పెళ్లి రోజున తనకు ఇష్టమైన 'పింక్ ప్లోయడ్' వైన్ బ్రాండ్‌ని ముఖ్య పానీయంగా
అతిథులకు అందిస్తున్నాడు. పెళ్లికి వచ్చిన అతిథులను నిరాశ పర్చకూడదనే ఉద్దేశ్యంతో బ్రాడ్ పిట్ ఈ ఏడాది మొదట్లో వైన్ స్టివార్డ్ కోర్సుని పూర్తి చేసి ఈ కోర్సులో నిష్ణాతుడని సర్టిఫికేట్‌ని కూడా సొంతం చేసుకున్నాడు.
పింక్ ఫ్లోయడ్ అనే వైన్ మిరావలి ఎస్టేట్‌కు చెందిన ప్రముఖులు ఎక్కువగా తీసుకునే పానీయం. బ్రాడ్ పిట్ వద్ద యూరప్‌లోనే ఎంతో సుప్రసిద్దమైన వైన్ ఉందని పిట్ అధికార ప్రతినిధి తెలిపారు. సో దీనిని బట్టి చూస్తుంటే బ్రాడ్‌పిట్ తాను సొంతంగా తయారు చేసిన వైన్‌ని పెళ్లి పెద్దలకు రుచిచూపించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ తమ పిల్లలతో కలిసి షూటింగ్ నిమిత్తం ఫ్రాన్స్ లోని టౌన్ ఆఫ్ లీ టోర్కట్‌లో ఉన్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











