Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మన్రో జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కిస్తా...: బ్రాడ్ పిట్
లండన్, జూన్ 6: హాలీవుడ్ సూపర్ స్టార్‌గా పేరుగాంచిన బ్రాడ్ పిట్ త్వరలో అలనాటి అందాల తార మార్లిన్ మన్రో జీవితానికి సంబంధించిన సినిమాని తీసేందుకు తన అంగీకారాన్ని తెలిపాడు. సినిమా రంగంలో చరిత్రలో ఓ కొత్త నూతన అధ్యయనానికి నాంది పలికి, తన కంటూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఐకానిక్ బాంబ్ షెల్ మార్లిన్ మన్రో జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో మార్లిన్ మన్రో పాత్రను నోమి వాట్స్ ధరించనుంది. ఈ సినిమాకు ఆండ్రూ డోమినిక్ దర్శకత్వం వహించనున్నాడు.
ఆండ్రూ డోమినిక్తో గతంలో బ్రాడ్ పిట్ 'ద అసాసినేషన్ ఆఫ్ జెస్సీ జేమ్స్' అనే చిత్రంలో నటించారు. బ్రాడ్ పిట్ సొంతంగా స్దాపించిన 'ప్లాన్ బి ప్రొడత్రక్షన్' కంపెనీ ద్వారా ఈ సినిమాని నిర్మించనున్నాడు. 48 సంవత్సరాల వయసు కలిగిన బ్రాడ్ పిట్ ఎలాగైనా సరే ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తానని తెలిపాడు. ఇక త్వరలో బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీల వివాహాం ఈ వేసవిలో దక్షణ ఫ్రాన్స్‌లో ఉన్న ఎస్టేట్‌లో పిట్, జోలీల 35 మిలియన్ పౌండ్ల విలువ చేసే ప్రయివేట్ ప్రార్దనాలయంలో చేసుకోనున్నట్లు సమాచారం.
వీరి పెళ్లి ఫంక్షన్‌కు సుమారు 200 నుండి 300 వరకు గెస్టులను ఆహ్వానించనున్నారు. పెళ్లి తారీఖుని మాత్రం అధికారంగా ఇంకా వెల్లడించ లేదు. గెస్టుల లిస్ట్‌లో మాట్ డామన్, జార్జ్ క్లూనీ, జానీ డెప్ మరియు టామ్ క్రూజ్ లాంటి హాలీవుడ్ మహా మహులు రానున్నారు.
50 సంవత్సరాల క్రితం హాలీవుడ్ లెజెండ్ మార్లిన్ మన్రో నగ్నంగా నటించిన ఫోటోషూట్ సంబంధించిన ఇమేజిలు ఇప్పడు భూమి మీద హాల్ చల్ చేయనున్నాయి. మే 23, 1962వ సంవత్సరంలో ఫాక్స్ ఫిల్మ్ స్టూడియోస్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్ద మార్లిన్ మన్రో నటించిన సినిమా 'సమ్‌థింగ్ గాట్ టు గివ్' షూటింగ్ సెట్లో ప్రముఖ ఫోటోగ్రాఫర్ 'లారెన్స్ షిల్లర్' తీసిన ఫోటోలు ఫోటోగ్రాఫర్ 'లారెన్స్ షిల్లర్' వద్ద మార్లిన్ మన్రోకు చెందిన ఫోటోల కలెక్షన్ ఉన్నప్పటికీ.. తాను రూపొందిస్తున్న కొత్త పుస్తకం 'మార్లిన్ & మి' కోసం కొన్ని ఫోటోలను ఫైనల్‌కు విడుదల చేశాడు.
36 సంవత్సరాల వయసులో చనిపోయిన మార్లిన్ మన్రోది కొందరు హత్య అన్నారు. మరి కొందరు ఆత్మహత్య అన్నారు. ఇంకొందరు 'డ్రగ్' ఎక్కువగా తీసుకోవడం వల్ల చనిపోయింది అన్నారు. చివరికి డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్లనే చనిపోయిందని అధికారికంగా ధృవీకరించారు.
తెలుగు వన్ఇండియా