Bullet Train థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో.. మూడేళ్ల తర్వాత బ్రాడ్‌పిట్ అదే మ్యాజిక్
హాలీవుడ్‌లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్‌లో ఒకరైన బ్రాడ్ పిట్ మూడేళ్ల తర్వాత ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఆయన నటించిన బుల్లెట్ ట్రైన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ కామెడీ అంశాలతో రూపొందిన ఈ చిత్రానికి మంచి రెస్సాన్స్ వస్తున్నది. పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్సులు, నాన్ స్టాప్ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నది.
అకాడమీ ఆస్కార్ అవార్డులను అందుకొన్న బ్రాడ్ మరోసారి బుల్లెట్ ట్రైన్ చిత్రం ద్వారా పవర్ ప్యాక్డ్ ఫెర్ఫార్మెన్స్‌ను చూపించాడు. గతంలో ఆయన నటించిన ట్రాయ్, మిస్టర్ అండ్ మిసెస్, ఓషియన్ ఎలెవెన్, ఓషియన్ టువెల్వ్, ఓషియన్ థర్టీన్, తి క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్, ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్, మనీ బాల్ చిత్రాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిన విషయం తెలిసిందే.

ఊహకు అందని విధంగా, నటుడు మరోసారి ఉత్తేజకరమైన యాక్షన్ సన్నివేశాలు, కామెడీ తో పాటు నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్‌తో నిండిన ఉత్తేజకరమైన రైడ్‌లో ప్రేక్షకులను తీసుకువెళ్లాడు. తాజాగా బుల్లెట్ ట్రైన్ చిత్రంతో మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్‌లో సరికొత్త అనుభూతిని పంచుతున్నది.
బ్రాడ్ పిట్ ఫెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్లు, సూపర్ సోనిక్ స్పీడ్, సీట్లకు అత్తుకొని పోయేలా థ్రిల్లింగ్ అంశాలు బుల్లెట్ ట్రైన్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారాయి.


Click it and Unblock the Notifications











