కుళ్లిపోయిన స్థితిలో.... నిన్నటి తరం స్టార్ హీరో దుర్మరణం!

హాలీవుడ్ నటుడు చార్లెస్ లెవిన్ ఎవరూ ఊహించని విధంగా దుర్మరణం పాలయ్యారు. అతని కారు వాయువ్య యుఎస్ఏ రాష్ట్రమైన ఒరెగాన్ లోని మారుమూల రహదారిలో చిక్కుకోవడంతో ఆయన మృత్యువాత పడ్డట్లు పోలీసులు వెల్లడించారు.

70 ఏళ్ల లెవిన్ కొన్ని రోజులుగా కనిపించకుండా పోయారు. ఆయన కోసం పోలీసులు, రెస్య్కూ వర్కర్స్ కొన్ని రోజులుగా వెతుకుతున్నారు. అతడి వాహనం ఎవరూ వెళ్లడానికి సాధ్యం కాని ఒక రోడ్డులో చిక్కుకున్నట్లు శనివారం గుర్తించారు. ఈ విషయాన్ని యూఎస్ఏలోని ది గ్రాంట్స్ పాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ వారు ధృవీకరించారు.

ఆవి చార్లెస్ లెవిన్ అవశేషాలు

ఆవి చార్లెస్ లెవిన్ అవశేషాలు

సమీపంలో చాలా నిటారుగా మరియు కఠినమైన భూభాగాలను శోధించిన తరువాత మానవ అవశేషాలు కనుగొనబడ్డాయి. అక్కడి పరిస్థితుల ఆధారంగా, అవశేషాలు చార్లెస్ లెవిన్ యొక్క అవశేషాలు అని అధికారులు భావిస్తున్నారు. సమీపంలో ఉన్న వాహనంలో లెవిన్ కుక్క చనిపోయి ఉన్నట్లు గుర్తించారు.

చార్లెస్ లెవిన్

చార్లెస్ లెవిన్

చార్లెస్ లెవిన్ 80, 90ల్లో పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. అమెరికాలో ప్రఖ్యాత సినీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన ఇలా ఊహించని విధంగా దుర్మరణం పాలవ్వడం అందరినీ విస్మయ పరిచింది. ఆయన మృతి పట్ల అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఆయన అక్కడికి ఎందుకు వెళ్లారు?

ఆయన అక్కడికి ఎందుకు వెళ్లారు?

జనసంచారం లేని ఆ ప్రాంతానికి చార్లెస్ లెవిన్ ఎందుకు వెళ్లారు? అక్కడ ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు వదిలారు? అనేది పూర్తి విచారణ తర్వాత తెలియనుంది. అధికారులు ఇందుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.

చార్లెస్ లెవిన్ నటించిన చిత్రాలు

చార్లెస్ లెవిన్ నటించిన చిత్రాలు

ఆనీ హాల్, బిట్వీన్ ది లైన్స్, రష్ ఇట్, మాన్‌హట్టన్, ది మ్యాన్ విత్ వన్ రెడ్ షూ, ది గోల్డెన్ చైల్డ్, ది కోచ్ ట్రిప్, నో హోల్డ్స్ బారియర్, ఇమ్మిడియేట్ ఫ్యామిలీ, ఎ సివిల్ యాక్షన్ చిత్రాల్లో నటించారు. చార్లెస్ లెవిన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X