‘47 వేల అమ్మాయిలతో శృంగారం.. 15 ఏటనే వర్జినిటీని కోల్పోయా’
అమెరికన్ టెలివిజన్, సినీ రంగంలో టాలెంటెడ్ యాక్టర్ చార్లీ షీన్ గురించి హాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తనదైన నటనతో ఎన్నో అంతర్జాతీయ అవార్డులు, రివార్డులు సొంతం చేసుకొన్న ఘనత ఆయనది. అయితే ఆయన వ్యక్తిగత జీవితం ఎప్పుడూ మీడియా హెడ్‌లైన్లను హిట్ చేస్తుంటుంది. అయితే తాజాగా హాలీవుడ్‌లో పాపులర్ ప్రాడ్ కాస్టర్ లోగన్ పాల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్‌గా తన శృంగార జీవితం గురించి పలు విషయాలను వెల్లడించారు. ఆయన గురించి, ఆయన చెప్పిన విషయాల గురించిన వివరాల్లోకి వెళితే..
చార్లీ షీన్ అసలు పేరు కార్లోస్ ఇర్విన్ ఎస్టేవెజ్. ఆయన నటించిన రెడ్ డాన్ చిత్రం 1984లో భారీ విజయం సాధించడంతో ఆయన తిరుగులేని ప్రేక్షకాదరణ దక్కింది. ఆ తర్వాత ఆయన నటించిన ప్లాటూన్, వాల్ స్ట్రీట్, యైట్ మెన్ అవుట్, యంగ్ గన్స్, మేజర్ లీగ్, హాట్ షాట్స్ అనే చిత్రాలు అత్యంత ప్రజాదరణ, ప్రేక్షకాదరణ పొందాయి.

టూ అండ్ హాఫ్ మెన్ అనే సిట్‌కామ్‌తో ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. ఆ షో గోల్డెన్ గ్లోబ్, ప్రైమ్ టైమ్ ఎమ్మీ నామినేషన్లు సంపాదించింది. 2010 సంవత్సర కాలంలో అమెరికాలో టెలివిజన్ రంగంలో అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకొన్న యాక్టర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ప్రతీ ఎపిసోడ్‌కు 1.8 మిలియన్ డాలర్ల పారితోషికాన్ని అందుకొన్నాడు.
చార్లీ షీన్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ముగ్గురు భార్యలతో వైవాహిక జీవితాన్ని కొనసాగించారు. 1995 డోన్నా పీలేను వివాహం చేసుకొని 1996లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత డెనైస్ రిచర్డ్స్‌ను 2002 సంవత్సరంలో వివాహం చేసుకొని.. 4 ఏళ్ల దాంపత్య జీవితం అనంతరం 2006 విడాకులు తీసుకొన్నాడు. ఆ తర్వాత బ్రూక్ మ్యుల్లర్ అనే ఆవిడను 2008 సంవత్సరంలో పెళ్లి చేసుకొని 2011లో విడాకులు ఇచ్చాడు. మూడు పెళ్లిళ్ల ద్వారా ఆయనకు 5 సంతానం కలిగింది.
అయితే తాజాగా లోగన్ పాల్‌కు ఇచ్చిన ప్రాడ్‌కాస్ట్‌లో తన శృంగార జీవితం గురించి బట్టబయలు చేశాడు. తన 59 సంవత్సరాల లైఫ్‌లో 47 వేల మంది అమ్మాయిలతో కోరిక తీర్చుకొన్నాను. వారితో పడక సుఖాన్ని అనుభవించాను అంటూ తన శృంగార చిట్టాను వదిలిపెట్టారు. తన 15 ఏట నుంచే అమ్మాయిలతో సుఖాన్ని పంచుకొన్నాను. యువకుడిగా ఉన్నప్పుడే వర్జినిటీని కోల్పోయాను అని చార్లీ షీన్ తెలిపాడు.
నేను 15 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో క్యాండీ అనే ఎల్లో పేజ్‌లో పరిచయమైన మహిళతో నా శృంగార జీవితం ప్రారంభమైంది. నా యవ్వనమంతా అమ్మాయిలు, డ్రగ్స్‌తో విచ్చలవిడిగా జీవితాన్ని అనుభవించాను. ఆ సమయంలో సాగించిన నా శృంగార జీవితం టైగర్ బ్లడ్ అంటూ ఆయన అభివర్ణించాడు. ఇలాంటి జీవితాన్ని బహిర్గతం చేయడంతో సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతున్నది. మరోసారి షీన్ రొమాంటిక్, వైల్డ్ లైఫ్ గురించి అభిమానులు చర్చించుకోవడంతో ఈ వ్యవహారం వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











