హాలీవుడ్ నటుడు క్లిఫ్ రాబర్ట్‌సన్ మృతి
స్పైడర్‌మ్యాన్ చిత్రాలలో 'అంకుల్ బెన్ పార్కర్" పాత్రతో అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్న హాలీవుడ్ నటుడు క్లిఫ్ రాబర్ట్‌సన్ మరణించారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. హాలివుడ్‌నటి డినా మెరిల్‌ని 1966లో రాబర్ట్‌సన్ పెళ్లాడారు. 1968 సంవత్సరంలో రూపొందిన 'చార్లీ" చిత్రంలో నటించిన రాబర్ట్‌సన్‌కు ఆస్కార్ అవార్డుల విభాగంలో ఉత్తమ నటుడు అవార్డు లభించింది. 'పిటి-109" చిత్రంలో జాన్ ఎఫ్ కెన్నడీ పాత్రను పోషించి రాబర్ట్‌సన్ అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. 1977లో జరిగిన పదివేల డాలర్ల చెక్ ఫోర్జరీ కేసులో రాబర్ట్‌సన్ నిందితుడు. 'ది గేమ్ ఆన్ బాబ్ హోప్ ప్రజెంట్స్ ది క్రైస్లర్ థియేటర్"లో ఉత్తమ ప్రదర్శనకు ఎమ్మీ అవార్డు లభించింది.


Click it and Unblock the Notifications











