»   » నాకు ఎయిడ్స్: షాకింగ్ విషయం బయట పెట్టిన టీవీ స్టార్

నాకు ఎయిడ్స్: షాకింగ్ విషయం బయట పెట్టిన టీవీ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఎంజెల్స్: పలు హాలీవుడ్ చిత్రాల్లో బాలనటుడిగా నటించడంతో పాటు, 'హు ఈజ్ ది బాస్' అనే టీవీ కార్యక్రమం ద్వారా అమెరికాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న డానీ పింటారో షాకింగ్ విషయం బయట పెట్టారు. తనకు ఎయిడ్స్ ఉందని బహిరంగంగా ప్రకటించాడు. గతేడాది విల్ టేబరస్ మహిళను వివాహమాడిన డానీ పింటారస్ టీవీ షోలో ఈ విషయం బయట పెట్టడం ద్వారా సంచలనం సృష్టించాడు.

ప్రముఖ టీవీ హోస్ట్ ఓఫ్రా విన్‌ఫ్రే నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షోలో పాల్గొన్న డానీ పింటారో ఈ షాకింగ్ న్యూస్ బయట పెట్టారు. '2003లో హెచ్.ఐ.వి వైరస్ సోకింది. చాలా కాలంగా ఈ విషయం బయటకు చెప్పుదామనుకున్నాను. కానీ చెప్పలేదు. ఇప్పుడు మాత్రం ఇదే సరైన సమయం అని భావించి చెబుతున్నాను' అని వెల్లడించారు.

 Actor Danny Pintauro Reveals He's HIV Positive

తనకు హెచ్ఐవీ ఉందని తెలియడంతో కాస్త దిగ్భ్రాంతికి గురయ్యాడు. ప్రస్తుతం హెచ్ఐవీ సోకిన వ్యక్తులకు తనవంతు సేవలు అందిస్తానని, వారిపట్ల సానుభూతితో ఉంటానని చెప్పాడు. 39 ఏళ్లు ఫింటారో స్వలింగ సంపర్కుడు. 1997 స్వలింగ సంపర్కుడిగా మారినప్పటి నుండి గేలకు మద్దతుగా పలు కార్యక్రమాలు నిర్వహించాడు.

English summary
Former “Who’s the Boss” actor Danny Pintauro has revealed he is battling HIV from past 12 years.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu