twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మార్టిన్ లూదర్ కింగ్ జూ' ఎలా హత్య చేయబడ్డాడు..!

    By Nageswara Rao
    |

    లండన్: మార్టిన్ లూధర్ కింగ్ జూ. ఎలా హాత్య చేయబడ్డాడనే కథాంశంతో హాలీవుడ్ స్టార్ హీరో హ్యూ జాక్మన్ ఓ సినిమాని నిర్మించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని నిర్మించేందుకు గాను హ్యూ జాక్మన్, చిత్ర నిర్మాత లీ డేనియల్స్‌ సహాకారం తీసుకోనున్నాడు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్, పైనాన్సియర్‌గా మిలినియమ్ ఫిల్మ్స్ వ్యవహరిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ ఇంకా ఖరారు కాలేదు.

    ఇందులో హ్యూ జాక్మన్ విలియమ్ పెప్పీ పాత్రని పోషించనున్నాడు. హ్యూ జాక్మన్ స్వతహాగా ఆస్టేలియా సంతతికి చెందిన హీరో. హ్యూ జాక్మన్ యాక్షన్, సూపర్ హీరో, రోమాన్స్ పాత్రలలో నటించడం వల్ల అంతర్జాతీయంగా మంచి గుర్తింపుని పొందాడు. X-Men ఫిల్మ్ సిరిస్‌లలో వోల్వరిన్ పాత్ర హ్యూ జాక్మన్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.

    వీటితో పాటు కేట్ అండ్ లియోపార్డ్, వాన్ హెల్సింగ్, ది ప్రెస్టేజ్, ఆస్టేలియా, రీల్ స్టీల్ లాంటి సినిమాలలో అధ్బుతంగా రాణించాడు. The Boy from Oz సినిమాలో నటించిన నటనకు గాను టోనీ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఓపెన్ సోలన్ అనే సోషల్ నెట్‌వర్క్‌ సైట్ నవంబర్ 2008న ప్రపంచంలో బ్రతికి ఉన్న సెక్సీయస్ట్ మ్యాన్ అంటూ కొనియాడింది. ఆ తర్వాత అదే నెలలో పీపుల్ మ్యాగజైన్ "Sexiest Man Alive అనే బిరుదునిచ్చింది.

    మూడు సార్లు టోనీ అవార్డు అందుకున్న హ్యూ జాక్మన్‌ ఒకసారి ఎమ్మీ అవార్డుని అందుకున్నాడు. ఫిబ్రవరి 22, 2009న జరిగిన 81వ అకాడమీ అవార్డుల కార్యక్రమానికి హోస్ట్‌గా హ్యూ జాక్మన్‌ వ్యవహారించారు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    Actor Hugh Jackman is working on an untitled movie about the assassination of Martin Luther King Jr. Jackman has collaborated with filmmaker Lee Daniels for the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X