ఆస్కార్ అవార్డుల వేదికపై నగ్నంగా మెరిసిన స్టార్ హీరో.. ఒంటిపై నూలుపోగు లేకుండా వచ్చి..!
అవార్డుల ఫంక్షన్ అంటే హంగులు అర్బాటాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇక అవార్డుల కార్యక్రామానికి వచ్చే ప్రతీ ఒక్కరు తమదైన రీతిలో గుర్తించబడాలని అనుకొంటారు. అభిమానుల అటెన్షన్‌ను సొంతం చేసుకోవాలని ఆరాటపడుతారు. తాజాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన 2024 సంవత్సరపు ఆస్కార్ అవార్డుల వేదికపై ఓ నటుడు నగ్నంగా వచ్చి సంచలనం రేపాడు. అలా నగ్నంగా రావడానికి కారణం ఏమిటంటే?
అమెరికాలోని లాస్ ఎంజెలెస్ నగరంలోని డౌల్బీ థియేటర్‌లో జరిగిన అట్టహాసంగా జరిగిన కార్యక్రమానికి జిమ్మి కిమ్మెల్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ర్యాన్ గోస్లింగ్, జేమ్స్ కామెరాన్, నటుడు, కుస్తీ యోధుడు జాన్ సేనా లాంటి ప్రముఖులు ప్రజెంటర్లుగా వ్యవహరించారు. టాప్ సెలబ్రిటీలు వేదికపైకి వచ్చి అప్పటికే నామినేషన్స్ పొందిన వారి పేర్లను చదవి వినిపించి.. ది అవార్డ్ గోస్ టూ అంటూ సంబంధింత నామినేషన్ ఎనౌన్స్ చేసి విజేతను ప్రకటించారు.

అయితే ఉత్తమ వస్త్రాలంకరణ అంటే క్యాస్టూమ్ డిజైన్ కేటగిరి విషయానికి వస్తే.. బార్బీ మూవీకి పనిచేసిన జాక్వైలైన్ డుర్రన్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ మూవీకి జాక్వలైన్ వెస్ట్ నెపోలియన్, జాంటీ యేట్స్ సినిమాకు డేవ క్రాస్మన్, ఓప్పెన్‌హైమర్ మూవీకి ఎలెన్ మిర్నిక్, పూర్ థింగ్స్ అనే చిత్రాకి హాలీ వాడింగ్గన్ నామినేట్ అయ్యారు.
అయితే క్యాటగిరిలో విజేతను ఎంపిక చేయడానికి వేదికపైకి జాన్ సేన వచ్చారు. అతడు నగ్నంగా వేదికపైకి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఒంటిపై నూలుపోగు లేకుండా స్టేజ్ పైకి రావడంతో ఏం జరుగుందో అనే గందరగోళం ఏర్పడింది. కేవలం ప్రైవేట్ పార్ట్ వద్ద ఒక ఎన్‌వలప్ కవర్‌ను పెట్టుకొని స్టేజీ దర్శనమిచ్చారు.

అందరూ ఇంకా షాక్ నుంచి బయటపడకముందే.. నేను బెస్ట్ క్యాస్టూమ్ అవార్డును ప్రకటించేందుకు వచ్చాను. నేకెడ్ క్యాస్టూమ్స్‌కు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. అందుచేత మీకు చాలా కీలక విషయాన్ని వెల్లడించడానికి వచ్చాను. అందుకే కవర్‌ను అడ్డంపెట్టుకొన్నాను. కానీ ఆ కవర్‌ను అడ్డు తొలగించలేను అని జాన్ సేన అన్నాడు. దాంతో నటుడి సమయస్పూర్తికి వేదిక అంతా నవ్వుల్లో మునిగిపోయింది.
ఇక బెస్ట్ క్యాస్టూమ్ అవార్డును జాన్ సేన ప్రకటిస్తూ.. ఈ సంవత్సరం అత్యుత్తమ క్యాస్టూమ్ అవార్డు పూర్ థింగ్స్ సినిమాకు పనిచేసిన హాలీ వాడింగ్టన్‌కు ఈ అవార్డు వచ్చింది అని ప్రకటించడంతో అందరూ చప్పట్లతో స్వాగించారు. ఇలా తనదైన శైలిలో ప్రకటించిన ఆయన చప్పట్ల మధ్య వేదికపై నుంచి వెళ్లిపోయారు.


Click it and Unblock the Notifications











