54లో కన్నుమూసిన హాలీవుడ్ నటుడు మైఖేల్ క్లార్క్ డంకన్
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్‌లో బాక్సాఫీసు రికార్డులు సృష్టించిన సినిమాల్లో నటించిన స్టార్ హీరో మైఖెల్ క్లార్క్ డంకన్ చనిపోయారు. లాస్ ఏంజిల్స్‌లో ఉన్న సీడర్స్-సినాని మెడికల్ సెంటర్‌లో సోమవారం ఉదయం కన్నుమూశారని మైఖెల్ క్లార్క్ ఫియాన్నీ రియాలిటీ టివి పర్సనాలిటీ ఓమరాసా మానిగల్ట్ తెలిపారు. ఈ సందర్బంలో ఆమె మాట్లాడుతూ మైఖెల్‌కు హార్ట్ ఎటాక్ రావడంతో దగ్గరలో ఉన్న మెడికల్ సెంటర్‌లో చేర్పించామని అన్నారు. ఈయన వయసు 54 సంవత్సరాలు.
6 అడుగుల 4 అంగుళాలు ఎత్తు ఉండే మైఖెల్ క్లార్క్ డంకన్ మొదట్లో బాడీగార్డుగా ఉన్న తన ముఫై పదుల వయసులో సినీ కెరీర్లోకి అడుగు పెట్టారు. జులై 13 నుండి హృదయ కుఢ్య కణ క్షయం వ్యాధి బారిన పడడంతో తీవ్రమైన బాధపడ్డాడని ఓమరాసా మానిగల్ట్ చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కావాలని కోరుకుంటున్నానని అన్నారు. జంతువుల హక్కుల సంస్థ PETAకు చెందిన వీడియోలో 2012 చలికాలంలో నటించి గత మూడు సంవత్సరాలుగా తన మాంసాహారం మానివేశానని, మూగ జీవుల పట్ల తన ప్రేమను తెలియజేశారు.
గతంలో తాను మాంసాహారం తీసుకున్నప్పటికంటే ఇప్పుడు చాలా బలంగా, ఆరోగ్య వంతంగా ఉన్నట్లు తెలిపాడు. 1999లో స్టీఫెన్ కింగ్ నవల ఆధారంగా రూపొందించబడిన 'ది గ్రీన్ మైల్' అనే సినిమాలో నటనకు గాను మైఖెల్ క్లార్క్ డంకన్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అకాడమీ అవార్డుని అందుకున్నారు. ఈ సినిమాలో మైఖెల్ క్లార్క్ డంకన్‌తో పాటు టామ్ హాంక్స్ కూడా నటించారు.
గత కొన్ని సంవత్సరాలుగా హాలీవుడ్‌లో బాక్సాఫీసు రికార్డులు సృష్టించిన సినిమాల్లోనే కాకుండా, ఆస్కార్ నామినేషన్స్ పొందిన సినిమాల్లో కూడా నటించారు. హాలీవుడ్ వెండితెరకు మైఖెల్ క్లార్క్ డంకన్ పరిచయం చేసింది బ్రూస్ విల్లిస్. బ్రూస్ విల్లిస్ దర్శకత్వంలో బ్రేక్ ఫాస్ట్ ఆఫ్ ఛాంపియన్స్, ది వోల్ నైన్ యార్డ్స్, సిన్ సిటీ నటించారు. వీటితోపాటు కుంగ్ పూ పండా, డెల్గో, బ్రదర్ బీర్ లాంటి యానిమేటెడ్ సినిమాల్లో కూడా నటించారు.
వీటితోపాటు హాలీవుడ్ టెలివిజన్ చరిత్రలో మంచి రేటింగ్స్‌ని రాబట్టిన ది ఫైండర్, టు అండ్ ద హాఫ్ మ్యాన్, ది సూట్ లైఫ్ ఆఫ్ జాక్ అండ్ కోడీ లాంటి వాటిల్లో నటించారు. మైఖెల్ క్లార్క్ డంకన్ 1957లో చికాగోలో జన్మించారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











