కూతురి కోరిక మేరకే సినిమాలో నటిస్తున్నా..!
లండన్: హాలీవుడ్ ప్రముఖ నటుడు రే విన్స్టోన్ తన కూతురు కోరిక మేరకు 'ఎల్పీ హాప్కిన్స్' అనే సినిమాలో ఎటువంటి పారితోషకం తీసుకోకుండా నటించాడు. ఇక వివరాల్లోకి వెళితే రే విన్స్టోన్ కూతురు జామీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'ఎల్పీ హాప్కిన్స్'. ఈ చిత్రంలో ఓ మంచి పాత్ర ఉండడంతో తన తండ్రికి ఆ పాత్ర ఖచ్చితంగా సరిపోతుండడంతో నటించమని అడడగా వెంటనే తన కూతురి కోరిక కాదన లేక పోయాడు.
55 సంవత్సరాల వయసు కలిగిన రే విన్స్టోన్ ఈ చిత్రంలో 'బుట్చేర్ బ్రైన్' అనే ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కథ విషయానికి వస్తే ఒక భీకరమైన కేసుని తెలుసుకునే టీన్ డిటెక్టివ్ ఆ కేసుని ఎలా చేధిస్తుందనే విషయాలను ఉత్కంఠ భరితంగా చూపించనున్నారు. ఈ సందర్బంలో జామీ మాట్లాడుతూ నా తండ్రితో కలసి నటించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా తండ్రి ఈ చిత్రంలో నటించడం నిజంగా మనోహారమైనదిగా భావించాను. ఆయనతో కలసి నటించడం నాకు చాలా గౌరవంగా ఉంది.
రే విన్స్టోన్ పూర్తి పేరు 'రేమండ్ ఆండ్రూ రే విన్స్టోన్'. పలు ఇంగ్లీషు సినిమాలతో పాటు టెలివిజన్ సిరిస్‌లలో కూడా నటించారు. 1979లో విడుదలైన స్కమ్ సినిమాలలో నటించిన రోల్స్‌ని బట్టి 'టఫ్ గైయ్' గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. వాయిస్ ఓవర్ యాక్టర్‌గా రే విన్స్టోన్ ఇంకా సుప్రసిద్దం.


Click it and Unblock the Notifications











