For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాజీ ప్రియుడిని కలిసేందుకు అంగీకరించిన క్రిస్టినా స్టివార్ట్

    By Nageswara Rao
    |

    లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ అందగాడిగా పేరుగాంచిన రాబర్ట్ ప్యాటిన్సన్ తన మాజీ గర్ల్ ఫ్రెండ్ క్రిస్టినా స్టివార్ట్‌‌తో ఫేస్ టు ఫేస్ కలిసేందుకు ఎట్టకేలకు అంగీకరించాడు. వివరాల్లోకి వెళితే 26 సంవత్సరాల వయసు కలిగిన రాబర్ట్ ప్యాటిన్సన్, క్రిస్టినా స్టివార్ట్ ఇద్దరూ 2008లో ట్విలైట్ సినిమా కలిసి నటించిన తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి అప్పటి నుండి 2012 జూన్ వరకు డేటింగ్‌లో మునిగి తేలారు.

    ఐతే ఇటీవల క్రిస్టినా స్టివార్ట్ 'స్నో వైట్ అండ్ ద హంట్స్ మ్యాన్' సినిమా దర్శకుడు రూపెర్ట్ సాండర్స్‌తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరిపోవడంతో వీరిద్దరూ విడిపోయారు. స్నో వైట్ అండ్ ద హంట్స్ మ్యాన్ సినిమాలో క్రిస్టినా స్టివార్ట్ హీరోయిన్‌గా నటించింది. గత మూడు సంవత్సరాలుగా రాబర్ట్ ప్యాటిన్సన్, క్రిస్టినా స్టివార్ట్ ఇద్దరూ హాలీవుడ్‌లో మంచి జోడిగా పేరు తెచ్చుకోవడంతో పాటు.. ప్రఖ్యాత ట్విలైట్ సిరిస్‌లలో వీరిద్దరూ నటించడం వల్ల ఆ సినిమా బాక్సాఫీసు వసూళ్లను వసూలు చేసింది.

    ఐతే క్రిస్టినా స్టివార్ట్, రాబర్ట్ ప్యాటిన్సన్‌ని మోసం చేసిన విషయం తెలుసుకోని తనని క్షమించాల్సిందిగా రాబర్ట్ ప్యాటిన్సన్‌కు ఫోన్ చేసి సుమారు గంట సేపు మాట్లాడినట్లు ప్రముఖ మ్యాగజైన్ లుక్ ఓ కథనంగా ప్రచురించింది. తన మాజీ ప్రేయసి అంత సేపు బ్రతిమాలే సరికే రాబర్ట్ కూడా క్రిస్టినాను కలిసేందుకు ఒప్పుకున్నాడు. 2008లో ట్విలైట్ సినిమా ద్వారా వీరిద్దరూ మొదటిసారి కలిశారు.

    రాబర్ట్ ప్యాటిన్సన్ తన జీవితంలో క్రిస్టినాని ప్రేమించినంతగా మరెవరిని ప్రేమించి ప్రేమించలేదని అందులో పేర్కోంది. క్రిస్టినా స్టివార్ట్ ఈరోజుకి తన తప్పు తెలుసుకుందని ఇప్పటికైనా చాలా సంతోషంగా ఉందని తను వ్యక్తం చేసినట్లు సమాచారం. రాబర్ట్‌ని కలిసి తాను చెప్పుకోవాల్సిన సంజాయిషి చాలా ఉందని క్రిస్టినా చెప్పింది. క్రిస్టినా స్టివార్ట్, దర్శకుడు రూపెర్ట్ సాండర్స్‌తో ఎఫైర్ పెట్టుకున్న తర్వాత ఈరోజు వరకు వీరిద్దరూ ఎక్కడా బహిరంగంగా కలుసుకోలేదు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    Actor Robert Pattinson has reportedly agreed to meet his ex-girlfriend, actress Kristen Stewart after a long conversation over the phone with her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X