హాలీవుడ్ హీరో రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య.
కాలిఫోర్నియా: హాలీవుడ్ హాస్య నటుడు రాబిన్ విలియమ్స్(63) ఆత్మహత్య చేసుకున్నారు. చివరి క్షణం వరకూ తన నవ్వులతో అందరినీ అలరించిన ఆయన తన అభిమానులను విషాదంలో ముంచేసారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో టిబ్యరాన్ ప్రాంతలో ఉండే రాబిన్ విలియమ్స్ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్తున్నారు. సోమవారం ఉదయం పదకొండు గంటల సమయంలో విషయం తెలుసుకున్న పోలీసులు..విలియమ్స్ ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే ఆయన చనిపోయి ఉన్నారు.

సంఘటనా స్ధలాన్ని పరిశీలించి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్తారు. అయితే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పులేమంటున్నారు. ఉక్కిరిబిక్కిరి అయి మృతి చెందినట్లు తమకు ప్రాధమిక సమాచారం ఉందని అన్నారు. తీవ్రమైన మనోవేదన వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు అక్కడి పత్రికలు అంటున్నాయి.
రాబిన్ విలియమ్స్ మరణ వార్త విన్న ఆయన కుటుంబం షాక్ కు గురైంది. ఆయన చనిపోయినట్లు తెలియటంతతో గుండె పగిలిపోయిందని ఆయన భార్య పేర్కొంది. తన భర్తను కోల్పోయాననే విషయం జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆమె ఆవేదనతో తెలిపారు. రాబిన్ తనకు మంచి భర్త గానే కాకుండా తనకు మంచి స్నేహితుడుగా అన్ని అర్దం చేసుకునే గొప్ప వ్యక్తి అని చెప్పారామె. అలాంటి వ్యక్తి దూరం కావటం కుటుంబానికి తీరని లోటని ఆమె కన్నిళ్లు పర్యంతమైంది.


Click it and Unblock the Notifications











