'హిట్' సినిమానా లేక కూతురితో గడిపిన క్షణాలా..?

By Nageswara Rao

లాస్ ఏంజిల్స్: తల్లిదండ్రులు విడిపోతే పిల్లలు ఎవరి వద్ద ఉండాలనేది పెద్ద ప్రశ్న. విడిపోవడం అనేది సాధారణ వ్యక్తుల నుండి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు జరుగుతూనే ఉంటుంది. ఐదు సంవత్సరాలు కలిసి జీవించి కొన్ని మనస్పర్దల వల్ల హాలీవుడ్ హీరో టామ్ క్రూయిజ్, హీరోయిన్ క్యాటీ హాల్మస్ ఇటీవల విడిపోయిన విషయం తెలిసిందే. క్యాటీ హాల్మస్ తన భర్త టామ్ క్రూయిజ్ నుండి విడాకులు కావాలంటూ న్యూయార్క్ కోర్టులో కోరడం.. వీరిద్దరూ విడాకులు తీసుకోవడం ఈజీగా జరిగిపోయాయి.

ఐతే ఇప్పుడు వచ్చిన సమస్య అల్లా వీరిద్దరి ముద్దుల గారాల కూతురు సూరి క్రూయిజ్ ఎవరి దగ్గర ఉండాలని. కోర్టు సూరి క్రూయిజ్ వయసు 6 సంవత్సరాలు ఉండడంతో కోర్టు తల్లి సంరక్షణలో పెరగాలని, కావాలంటే టామ్ క్రూయిజ్ ఖాళీ సమయంలో తన కూతురితో గడపవచ్చునని తీర్పు నిచ్చింది. ఈ తీర్పు నచ్చని టామ్ క్రూయిజ్ తనకున్న పలుకుబడిని అంతటిని ఉపయోగించి తన కూతురుని ఎలాగైనా సరే తన వద్దకు తీసుకురావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇందుకోసం గాను క్యాటీ హాల్మస్‌పై లీగల్ కస్టడీ ద్వారా పోరు చేసేందుకు సన్నద్దమైనట్లు సమాచారం. ప్రస్తుతం టామ్ క్రూయిజ్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. దీని వల్ల తన కూతురు సూరి క్రూయిజ్‌తో ఎక్కవ సమయం గడపలేక పోతున్నాడు. త్వరితగతిన తన చేతినిండా ఉన్న సినిమాలను పూర్తి చేసి తన కూతురితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నాడు. తన జీవితంలో ఎన్నో బాక్సీఫీసు సినిమాలలో నటించిన తన కూతురు కంటే ఆ బాక్సాఫీసు సినిమాలు ఎక్కువ కాదని తన కూతురుకి తెలియజేయలనే ఉద్దేశ్యంతో టామ్ క్రూయిజ్ ఉన్నాడు.

సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయం కూతురికే కేటాయించనున్నట్లు టామ్ అధికార ప్రతినిధి తెలిపారు. రాబోయే కాలంలో టామ్ క్రూయిజ్ తన కూతురిని తన చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారనేది హాలీవుడ్ సమాచారం.

తెలుగు వన్ఇండియా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X