Don't Miss!
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ముద్దు పెట్టుకోవాలని చూశాడు, అందుకే చెంప దెబ్బ
లాస్ ఏంజిల్స్: ఒక ఈవెంట్లో భాగంగా రెడ్ కార్పెట్ పై నడుస్తూ వస్తుండగా.. తనని ముద్దు పెట్టుకోవాలని చూసిన ఓ రిపోర్టర్ని హాలీవుడ్ హీరో విల్ స్మిత్ చెంపదెబ్బ కొట్టాడని సామాచారం. ఇక వివరాల్లోకి వెళితే ఉక్రేయిన్ టెలివిజన్‌కు చెందిన రిపోర్టర్‌గా అతనిని గుర్తించారు. విల్ స్మిత్ హీరోగా నటించిన 'మెన్ ఇన్ బ్లాక్ 3' సినిమా ప్రీ స్క్రీనింగ్ ఇంటర్యూలో ఆ రిపోర్టర్ విల్ స్మిత్ పెదాలపై ముద్దు పెట్టుకోవాలనే భావించి అతనిని పట్టుకోగా వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా విల్ స్మిత్ అతని చెంప పగల కొట్టడం జరిగింది.
ఈ సందర్బంలో విల్ స్మిత్ తన ప్రశాంతత కోల్పోయి తన చెంపపై కొట్టి 'హే మ్యాన్, యో మ్యాన్, అసలు నీ సమస్య ఏమిటని రిపోర్టర్ని ప్రశ్నించాడు. ఆ తర్వాత అక్కడున్న మిగిలిన రిపోర్టర్స్ తో నన్ను క్షమించండి. అతను నా పెదాలపై ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించాడు. అందుకే అలా చేశా. జోకర్, ఇంకా అదృష్ట వంతుడు నేను ఇంకా నా పంచ్ ఇవ్వలేదని తెలిపాడు. విల్ స్మిత్ చేతిలో చెంప దెబ్బ తిన్న ఆ ఉక్రేయిన్ రిపోర్టర్ గతంలో కూడా చాలా సార్లు పలువురు సెలబ్రిటీలను ముద్దు పెట్టుకున్నాడని ఆ తర్వాత తెలిసింది.