twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముద్దు పెట్టుకోవాలని చూశాడు, అందుకే చెంప దెబ్బ

    By Nageswara Rao
    |

    లాస్ ఏంజిల్స్: ఒక ఈవెంట్‌లో భాగంగా రెడ్ కార్పెట్ పై నడుస్తూ వస్తుండగా.. తనని ముద్దు పెట్టుకోవాలని చూసిన ఓ రిపోర్టర్‌ని హాలీవుడ్ హీరో విల్ స్మిత్ చెంపదెబ్బ కొట్టాడని సామాచారం. ఇక వివరాల్లోకి వెళితే ఉక్రేయిన్ టెలివిజన్‌కు చెందిన రిపోర్టర్‌గా అతనిని గుర్తించారు. విల్ స్మిత్ హీరోగా నటించిన 'మెన్ ఇన్ బ్లాక్ 3' సినిమా ప్రీ స్క్రీనింగ్ ఇంటర్యూలో ఆ రిపోర్టర్ విల్ స్మిత్‌ పెదాలపై ముద్దు పెట్టుకోవాలనే భావించి అతనిని పట్టుకోగా వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా విల్ స్మిత్ అతని చెంప పగల కొట్టడం జరిగింది.

    ఈ సందర్బంలో విల్ స్మిత్ తన ప్రశాంతత కోల్పోయి తన చెంపపై కొట్టి 'హే మ్యాన్, యో మ్యాన్, అసలు నీ సమస్య ఏమిటని రిపోర్టర్‌ని ప్రశ్నించాడు. ఆ తర్వాత అక్కడున్న మిగిలిన రిపోర్టర్స్ తో నన్ను క్షమించండి. అతను నా పెదాలపై ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించాడు. అందుకే అలా చేశా. జోకర్, ఇంకా అదృష్ట వంతుడు నేను ఇంకా నా పంచ్ ఇవ్వలేదని తెలిపాడు. విల్ స్మిత్ చేతిలో చెంప దెబ్బ తిన్న ఆ ఉక్రేయిన్ రిపోర్టర్ గతంలో కూడా చాలా సార్లు పలువురు సెలబ్రిటీలను ముద్దు పెట్టుకున్నాడని ఆ తర్వాత తెలిసింది.

    English summary
    Actor Will Smith slapped a male reporter who tried to kiss him while walking the red carpet at an event.The reporter from a Ukrainian television station was attempting a pre-screening interview when he grabbed the actor and tried to plant a kiss on his lips.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X