twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోతో అక్రమ సంబంధమే ఆమె కాపురంలో చిచ్చు పెట్టింది

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ స్టార్ హీరోయిన్, సింగర్ జెన్నిఫర్ లోపెజ్ ఏడు సంవత్సరాలు కలసి ఉన్న తన భర్త మార్క్ ఆంటోని నుండి రెండు రోజలు క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. అసలు వీరిద్దరూ విడిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయని ఆరా తీస్తే చివరకు జెన్నిఫర్ లోపెజ్, విలియమ్ లెవీకు మద్య ఉన్న శారీరక సంబంధమే భార్యభర్తలు విడిపోవడానికి కారణం అని తెలిసింది. అమెరికన్ యాక్టర్ అయినటువంటి విలియమ్ లెవీ, జెన్నిఫర్ లోపెజ్ ఇద్దరూ కలసి 'ఐయామ్ ఇన్‌టు యు' అనే మ్యూజిక్ వీడియోలో కలసి నటించడం జరిగింది.

    వీరిద్దరూ కలసి నటించినటువంటి ఈ వీడియోలో వీరిద్దరూ బీచ్‌లో అందమైన లోకేషన్స్‌లలో ఒకరినోకరు విడిచి ఉండలేనంతగా షూటింగ్ స్పాట్‌లో తయారవ్వడం జరిగిందంట. ఇది మాత్రమే కాకుండా మెక్సికోలో ఏప్రిలో జరిగిన ఈ షూటింగ్‌లో విలియమ్ లెవీ ఒంటి మీద ఎటువంటి ఆచ్చేధనం లేకుండా జెన్నిఫర్ లోపెజ్‌ని మంత్ర ముగ్దురాలిని చేయడంతో వీరి మద్య సంబంధం బలపడిందని అంటున్నారు. ఈ వీడియో సాంగ్ షూటింగ్ అయిన తర్వాత ఇది చూసినటువంటి విలియమ్స్ లెవీ భార్య ఎలిజిబెత్ తన భర్త నుండి ఒక నెలలోపే విడిపోయింది. ఈ మ్యూజిక్ వీడియోలో వీరిద్దరూ కలిసి తెరమీద హాట్ హాట్ సీన్లలలో నటిస్తే తెరవెనుక ఇంకా ఏమి చేసి ఉంటారో ఈ పాటికే మీకు అర్దం అయి ఉంటుంది.

    విలియమ్ లెవీ వల్లనే జెన్నిఫర్ లోపెజ్ భార్య భర్తలు విడిపోయారని తెలిసుకున్న విలియమ్ లెవీ తన అధికార ప్రతినిధి చేత ఈ క్రింది విధంగా మాట్లాడించారు. విలియమ్ లెవీ అధికార ప్రతినిధి మాట్లాడిన దాని ప్రకారం జెన్నిఫర్ లోపెజ్, విలియమ్ లెవీ మద్య ఉన్న సంబంధం కేవంల ప్రోపెషనల్ రిలేషన్ షిప్ మాత్రమేనని అన్నారు. అంతేకానీ వారిద్దరిపై వచ్చిన సెక్సుకు సంబంధించిన రిలేషన్ షిప్‌ని ఖండించారు. కేవలం వారిద్దరు స్నేహితులు మాత్రమేనని అన్నారు.

    English summary
    Now that Jennifer Lopez and Marc Anthony are parting ways after 7 years of marriage, there's plenty of speculation about what caused their split. But the sexiest rumor by far has to be the claim that Lopez had a steamy encounter with Cuban-American actor William Levy, her co-star in her music video for "I'm Into You."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X