నా భర్త రాక్షసుడు... డ్రగ్స్‌తో నరకం, గొంతు పిసికి: ప్రముఖ హీరోయిన్ కేసు, 300 కోట్ల పరువునష్టం
హలీవుడ్ నటుడు జానీ డిప్ లైంగిక దాడి ఆరోపణలతో చిక్కుల్లో పడ్డారు. జానీపై ఏకంగా ఆయన మాజీ భార్య, నటి, మోడల్ అంబర్ హర్డ్ ఆరోపణలు చేస్తూ కోర్టుకు ఎక్కడం హాలీవుడ్‌లో సంచలనానికి దారి తీసింది. తనను మానసికంగా హింసించినందుకు నష్టపరిహారం, పరువు నష్టం చెల్లించాలని కోర్టులో దావా వేసింది. అంబర్ హార్డ్ చేసిన ఆరోపణలు ఏమిటంటే..

ఏడాదిపాటు నాకు నరకం
జానీ డిప్‌తో ఏడాదిపాటు రిలేషన్‌షిప్ సాగింది. ఆ కాలంలో ఆయన మద్యం, డ్రగ్స్ బానిస అనే విషయాన్ని గ్రహించాను. కొన్నిసార్లు ఆయన నిషేధిత పదార్థాలు, మెడికేషన్స్‌ను తీసుకోవడంతో ఆందోళన చెందాను. ఆయనను వాటి నుంచి బయటపడేసేందుకు ట్రీట్‌మెంట్ చేయించే ప్రయత్నం చేశాను. ఆయన మానసిక పరిస్థితి చూస్తే భయం వేసేంది అని హంబర్ హార్డ్ వెల్లడించింది.

ఏం చేసేవాడో అతడికి గుర్తుండేది కాదు
డ్రగ్స్ తీసుకొన్న తర్వాత పూర్తిగా ఆయన వ్యక్తిత్వానికి భిన్నంగా మారిపోయేవాడు. హింసాత్మక ధోరణితో ప్రవర్తించే వాడు. మద్యం, మాదక ద్రవ్యాలు తీసుకొన్న తర్వాత ఏం చేసేవాడో గుర్తుండేది కాదు. దారుణంగా శారీరకంగా, మానసికంగా దాడి చేసే వాడు. ఆయనను ప్రేమించాను కాబట్టి అతడి వేధింపులను భరించాను అని హంబర్డ్ హార్డ్ తెలిపింది.

మెడ పట్టుకొని బెడ్ కొడితే...
మద్యం, మాదక ద్రవ్యాల మత్తులో రాక్షసుడిలా ప్రవర్తించే వాడు. ఒకరోజు నా జుట్టు, మెడ పట్టుకొని చంపేందుకు ప్రయత్నించాడు. నిన్ను చంపాలనిపిస్తున్నది. నా మాటలు వింటున్నావా అంటూ బెడ్ మీదకు వేసి తన తలను బెడ్‌కు కొట్టాడు. డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడుతానని చాలా సార్లు ప్రామిస్ చేశాడు. కానీ అవన్నీ ఉత్తివే అని తేలింది. ఆయనను నమ్ముకోవడం తప్పని ఆలస్యంగా గ్రహించాను అని హంబర్ తన బాధలను వెళ్లగక్కింది.

ఊపిరి తీసుకోకుండా గొంతు నులిమితే
జానీ డిప్ పెట్టే టార్చర్‌తో అరిచేందుకు కూడా వీలులేకుండా పోయేది. గొంతు పట్టుకొంటే ఊపిరి తీసుకొనే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఆయన చేష్టలు చూస్తే అతడి చేతిలో నా ప్రాణాలు పోవడం ఖాయమనే భయంతో బతికాను. మద్యం మత్తులో ఇంట్లో వస్తువులను విసిరికొట్టే వాడు. బండబూతులు తిడుతూ నానా రకాలుగా వేధించేవాడు అని హంబరడ్ హార్డ్ తన ఫిర్యాదులో పేర్కొన్నది.

340 కోట్ల నష్టపరిహారం కావాలి
నన్ను రకరకాలుగా హింసించినా నేను ఆయనపై ఎన్నడూ దాడి చేయలేదు. అతడిని తప్పుదోవ పట్టించానని పలువురు ఆరోపణలు చేయడంతో చాలా బాధపడ్డాను. నాపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమే. నాకు జరిగిన మానసిక, పరువు నష్టానికి రూ. 340 కోట్లు (50 మిలియన్ల డాలర్లు) చెల్లించాలని కోర్టును కోరింది. జానీ డిప్, హంబర్ 2015లో పెళ్లి చేసుకొన్నారు. ఆ తర్వాత 2017లో వారిద్దరూ విడిపోయారు.


Click it and Unblock the Notifications











