బెడ్‌రూంలో లవర్‌తో చరణ్ హీరోయిన్: బట్టలు ఉన్నా లేనట్లే హాట్‌గా!
మిగిలిన రంగాలతో పోల్చుకుంటే సినిమాల్లో నటించే వాళ్లకు ప్రేమ వ్యవహారాలు, ఎఫైర్లు, డేటింగులు, బ్రేకప్‌లు, లవ్ మ్యారేజ్‌లు వంటివి చాలా సామాన్యమైన విషయాలు అని చెప్పొచ్చు. ముఖ్యంగా హాలీవుడ్ వాళ్లు వీటిని చాలా లైట్‌గా తీసుకుంటుంటారు. ఇప్పుడలాంటి వ్యవహారాలతోనే హైలైట్ అవుతోంది ఫారెన్ పిల్ల అమీ జాక్సన్. ఇండియాలో ముఖ్యంగా తెలుగు, తమిళంలో సినిమాలు చేసిన ఈ భామ.. ఇప్పుడు పెద్దగా యాక్టింగ్ చేయట్లేదు. కానీ, లవ్ ఎఫైర్‌తో హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అమీ కొన్ని రొమాంటిక్ పిక్స్ వదిలింది. అవి మీకోసమే!
ఆ చిత్రాలతో ఫుల్ ఫేమస్:హాలీవుడ్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమీ జాక్సన్ 'మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రం ద్వారా ఇండియాలోకి ఎంటరైంది. ఆ తర్వాత రామ్ చరణ్ 'ఎవడు' మూవీతో తెలుగులోకి కూడా అడుగు పెట్టింది. ఆ వెంటనే దిగ్గజ దర్శకుడు శంకర్ రూపొందించిన 'ఐ', 'రోబో 2.0' సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. తద్వారా ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయింది.

పెళ్లి కాకుండానే తల్లైంది:ఇండియాలో వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న సమయంలోనే ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్.. మోడల్, యాక్టర్ జార్జ్ పనాయొటోతో ప్రేమాయణం సాగించింది. ఆ సమయంలోనే ఆమె ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాత లవర్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఇది జరిగిన కొద్ది రోజులకు ఈ బ్యూటీ ఓ మగ బిడ్డకు తల్లైంది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగానే ఉంటూ వస్తోంది.

అతడితో బ్రేకప్.. ఇతడితో:జార్జ్ పనాయొటోతో లవ్‌లో ఉన్నప్పుడే తల్లైన అమీ జాక్సస్.. ఆ తర్వాత అతడిని పెళ్లి చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ అమ్మడు తన ప్రియుడుకు బ్రేకప్ చెప్పేసింది. అప్పటి నుంచి బిడ్డతో కలిసి సమయాన్ని గడుపుతూ వచ్చింది. అయితే, కొంత కాలం తర్వాత ఈ భామ.. ఎడ్ వెస్ట్‌విక్ అనే విదేశీ నటుడితో డేటింగ్ చేయడం మొదలు పెట్టింది.
మరింత రచ్చ.. రీఎంట్రీ:అమీ జాక్సన్ ఇప్పుడు ఎడ్ వెస్ట్‌విక్ అనే విదేశీ నటుడితో డేటింగ్ చేస్తోన్న విషయం తెలిసిందే. అతడితో తరచూ ఈ అమ్మడు రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ప్రియుడితో కలిసి రచ్చ రచ్చ చేస్తూనే ఉంటోంది. ఇలా ఇద్దరూ నిత్యం రొమాన్స్‌ను పండిస్తూ రెచ్చిపోతోన్నారు. ఇక, ఇప్పుడు అమీ జాక్సన్ ఓ తమిళం చిత్రం ద్వారా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే.

అందులో మాత్రం రచ్చ:సుదీర్ఘ కాలం పాటు వరుస పెట్టి సినిమాలు చేసినా.. ఈ మధ్య ఖాళీగానే ఉంటోన్నా అమీ జాక్సన్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే ఈ అమ్మడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలతో పాటు కెరీర్ గురించిన ప్రతి విషయాన్ని ఫాలోవర్లతో పంచుకుంటూ ముందుకెళ్తోంది. దీంతో క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

ప్రియుడితో ఎంజాయ్‌గా:సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోన్న అమీ జాక్సన్.. తన అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలతో పాటు అప్పుడప్పుడూ రొమాంటిక్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితమే అమీ జాక్సన్.. కొత్త బాయ్‌ఫ్రెండ్ ఎడ్ వెస్ట్‌విక్‌తో తీసుకున్న రొమాంటిక్ ఫొటోలను షేర్ చేసింది. ఫలితంగా తరచూ వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్ అవుతోంది.

లవర్‌తో రొమాంటిక్‌గా:సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే అమీ జాక్సన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు తన ప్రియుడితో కలిసి బెడ్‌రూంలో రొమాంటిక్ ఫోజులు ఇచ్చింది. అంతేకాదు, ఈ పిక్స్‌లో ఆమె డ్రెస్ వేసుకున్నా లేనట్లు కనిపించింది. మొత్తానికి అమీ జాక్సన్ షేర్ చేసిన ఫొటోలకు భారీ స్థాయిలో స్పందన వచ్చి.. వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











