కాబోయే భర్త కోసం గిప్ట్‌గా హెలికాప్టర్‌‌ని కొన్న జోలీ

By Nageswara Rao

Angelina Jolie and Brad Pitt
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజిలీనా జోలీ తనకి కాబోయే భర్త బ్రాడ్ పిట్ కోసం హెలికాప్టర్‌ని కొనుగోలు చేసింది. 36 సంవత్సరాలు వయసు కలిగిన ఏంజిలీనా జోలీ, బ్రాడ్ పిట్ ఇద్దరూ త్వరలో వివాహాం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఏంజిలీనా జోలీ 1 మిలియన్ పౌండ్స్ ని ఖర్చు చేసి మరీ ఈ హెలికాప్టర్‌ని కొనుగోలు చేసి బ్రాడ్ పిట్‌కు గిప్ట్ గా అందివ్వనుంది. దీని కోసం ప్రత్యేకించి దక్షణ ఫ్రాన్స్ చాటూ మిరావల్‌లో ఉన్న ఇంట్లో హెలికాప్టర్ ప్యాడ్‌ని ఇప్పటికే సిద్దం చేసింది.

ఈ విషయంపై స్పందించిన జోలీ ఈ గిప్ట్‌ని బ్రాడ్ పిట్‌కి ప్రజెంట్ చేస్తే ఆశ్చర్యపడతాడని తెలిపింది. త్వరలో జరగనున్న ఈవెంట్స్ కోసం ఈ జంట హెలికాప్టర్‌ని ఉపయోగించనున్నారు. బ్రాడ్ పిట్‌కి ఇప్పటికే ప్రయివేట్ పైలెట్ లైసెన్స్ ఉన్నప్పటికీ.. అతను గాల్లో ఎగురేందుకు కొ్ని పాఠాలు తీసుకోవడం అవసరం అని జోలీ తెలిపింది.

మే 16వ తారీఖు నుండి మే 27 వరకు జరగనున్న కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ఈ హెలికాప్టర్ నే ఉపయోగిస్తారని జోలీ అధికార ప్రతినిధి తెలిపారు. బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీల వివాహాం ఈ వేసవిలో దక్షణ ఫ్రాన్స్‌లో ఉన్న ఎస్టేట్‌లో పిట్, జోలీల 35 మిలియన్ పౌండ్ల విలువ చేసే ప్రయివేట్ ప్రార్దనాలయంలో చేసుకోనున్నట్లు సమాచారం. వీరి పెళ్లి ఫంక్షన్‌కు సుమారు 200 నుండి 300 వరకు గెస్టులను ఆహ్వానించనున్నారు. పెళ్లి తారీఖుని మాత్రం అధికారంగా ఇంకా వెల్లడించ లేదు. గెస్టుల లిస్ట్‌లో మాట్ డామన్, జార్జ్ క్లూనీ, జానీ డెప్ మరియు టామ్ క్రూజ్ లాంటి హాలీవుడ్ మహా మహులు రానున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X