పెళ్లి రోజున ధరించే డ్రస్సు కోసం బరువెక్కుతున్న సూపర్ స్టార్
లండన్: ఏడు సంవత్సరాలు కలిసి జీవించిన తన పాట్నర్ బ్రాడ్ పిట్ తో హాలీవుడ్ సూపర్ స్టార్ ఏంజిలీనా జోలీల పెళ్లి ఈ వేసవిలో జరగనున్న విషయం తెలిసిందే. వెడ్డింగ్ డేకి ముందు జోలీని పిట్ కొంచెం బరువు పెరగమని కోరగా.. అనుకున్నదే తడవుగా పిట్ కోరికను కాదనలేక ఏంజిలీనా జోలీ సుమారు 10 పౌండ్లు బరువు పెరిగిందని హాలీవుడ్ కోడై కూస్తుంది. ప్రస్తుతం స్లిమ్‌గా ఉన్న ఏంజిలీనా జోలీ పెళ్లి రోజున ధరించే వెడ్డింగ్ డ్రస్సు కోసమే ఇలా బరువుని పెరిగిందని సమాచారం.
ఇటీవలే ఈ జంట బ్రిటిష్ చెఫ్ జామి ఒలివర్‌ని కలసి మంచి ఆరోగ్యకరమైన భోజనం కోసం ఏమేమి వంటకాలు తినాలో సలహాలు తీసుకున్నారు. బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీల వివాహాం వేసవిలో దక్షణ ఫ్రాన్స్‌లో ఉన్న ఎస్టేట్‌లో పిట్, జోలీల 35 మిలియన్ పౌండ్ల విలువ చేసే ప్రయివేట్ ప్రార్దనాలయంలో చేసుకోనున్నట్లు సమాచారం. వీరి పెళ్లి ఫంక్షన్‌కు సుమారు 200 నుండి 300 వరకు గెస్టులను ఆహ్వానించనున్నారు. పెళ్లి తారీఖుని మాత్రం అధికారంగా ఇంకా వెల్లడించ లేదు.
గెస్టుల లిస్ట్‌లో మాట్ డామన్, జార్జ్ క్లూనీ, జానీ డెప్ మరియు టామ్ క్రూజ్ లాంటి హాలీవుడ్ మహా మహులు రానున్నారు. పిట్, జోలీలు 2004లో మిష్టర్ అండ్ మిసెస్ స్మిత్ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. అప్పటికే పిట్‌కు జెన్నిఫర్ అనిస్టన్‌తో వివాహమైంది. 2005లో బ్రాడ్, ఏంజెలినాల ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. అనంతరం బ్రాడ్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. ఏంజెలినాకు అప్పటికి రెండుసార్లు వివాహమైంది. ఆమె గతంలో జానీ లీ మిల్లర్, బిల్లీ బాబ్ థ్రాంటన్‌లను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బ్రాడ్, ఏంజెలినాలకు ఆరుగురు పిల్లలున్నారు. వారిలో ముగ్గుర్ని దత్తత తీసుకోగా, మరో ముగ్గురికి జన్మనిచ్చారు.
ఇటీవలే ఏంజిలీనా జోలీ బోస్నియా గౌరవ పౌరసత్వాన్ని అందుకుంది. ఇటీవల ఏంజిలీనా జోలీ దర్శకత్వ పర్యవేక్షణలో 'ఇన్ ద ల్యాండ్ బ్లడ్ అండ్ హానీ' సినిమా విడుదల చేసి అక్కడి ప్రజల మన్ననలను పొందిన విషయం తెలిసిందే. ఏంజిలీనా జోలీకి ఈ గౌరవాన్ని మే 3వ తారీఖున బోస్నియా రాజధాని 'సారజీవో' లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫంక్షన్ ఇవ్వనున్నట్లు బోస్నియా ప్రతినిధులు తెలిపారు.


Click it and Unblock the Notifications











