పుస్తకం ఆధారంగా సినిమా.. ఆమె నటిస్తే సూపర్ హిట్..?
లండన్: హాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఏంజిలీనా జోలీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక పుస్తకాలు అమ్ముడైన "Fifty Shades of Grey" అనే పుస్తకం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న సినిమాలో ఓ అందమైన పాత్ర "అనస్తాసియా స్టీల్"ని పోషించేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఈ పుస్తకంలో సెక్సువల్ కంటెంట్ ఎక్కువగా ఉండడం విశేషం.
ఈ పుస్తక ప్రకారం కథ విషయానికి వస్తే అనస్తాసియా అనే కన్నెగా ఉన్న అందమైన అమ్మాయి క్రిస్టియన్ గ్రే అనే ఓ యువ వ్యాపార వేత్త ప్రేమలో పడి ఎలా మోసపోతుందనేది ముఖ్యంగా సాగుతుంది. 37 సంవత్సరాల వయసు కలిగిన ఏంజిలీనా జోలీ ఈ నవలను పూర్తిగా చదివి ఈ పాత్రను మెచ్చే ఈ సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నారు. "Fifty Shades of Grey" అనే పుస్తకం గురించి ఏంజిలీనా జోలీ లండన్‌లో ఉన్నప్పుడు విన్నారు.
ఈ పుస్తకం గురించి తెలియగానే జోలీ ఎలాగైనా దీనిని చదవాలని, స్వయంగా తానే వెళ్లి ఈ పుస్తకాన్ని కొనుక్కోని మరీ చదడవంతో.. ఈ పుస్తకాన్ని సినిమాగా ఏ విధంగా తెరపైకి ఎక్కిస్తారంటూ యూనిట్ సభ్యులంతా గుసగుసలాడుకున్నారంట. ఈ పుస్తకం ఆధారంగా తీస్తున్న సినిమాలో ఏంజిలీనా జోలీ నటిస్తే తప్పకుండా బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఏంజిలీనా జోలీ 'మేల్ ఫీసియంట్' సినిమాలో నటిస్తున్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











