దర్శకుడి మోసం, హీరోయిన్‌కి ప్రాణభయం!
లండన్ : వివాదాస్పద ఇస్లాం వ్యతిరేక చిత్రం 'ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిం'పై ప్రపంచంలోని ఇస్లాం లోకం మొత్తం భగ్గమంటున్న సంగతి తెలిసిందే. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు ఒక అమెరికన్ తయారు చేసిన వివాదాస్పద చిత్రం అమెరికా సర్కారుకు ఇరకాటంగా మారింది. ఈచిత్రంలో నటించిన వారు ఇప్పుడు అర చేతితలో ప్రాణాలు పట్టుకుని బిక్కుబిక్కుమనే పరిస్థితి నెలకొంది.
ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన నటి అనాగుర్జీ తాను ప్రాణ భయంతో గడుపుతున్నానని 'డెయిలీ మెయిల్' ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయింది. చిత్ర దర్శకుడు నకోలా బాసెలీ నకోలా(శ్యాం బేసిల్) తనను ఏమార్చి ఇందులో జార్జ్ అనే పాత్ర సరసన హిలారీ అన బాలవధువు పాత్రకు ఒప్పించినట్లు ఆమె ఆరోపించింది.
తనకు పాత్ర వివరాలు పూర్తిగా వెల్లడించలేదని, దర్శకుడు తనను మోసగించాడని, ఇప్పుడు తాను ఇంటికే పరిమితమై భయంతో కాలం గడుపుతున్నానని, ప్రాచీన పశ్చిమాసియా ప్రాంతంలో భూమిపై తోకచుక్క పడిన అంశానికి సంబంధించిన ఈ చిత్రాన్ని యాక్షన్ చిత్రంగానే తాను భావించానని, ఇందులో ఉన్న రహస్య ఎజెండా గురించి తనకు తెలియదని చెప్పింది.
ప్రపంచ వ్యాప్తంగా యుఎస్ కాన్సులేట్లపై దాడులు కారణమైన చిత్రానికి దర్శకత్వం వహించిన అమెరికన్ దర్శకుడు శ్యాం బేసిల్ ప్రస్తుతం అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్నారు. ఈయన తన మనోభావాలను ప్రపంచానికి తెలుపాలని ఓ ప్రముఖ వార్తా పత్రికకు సందేశం పంపించాడు. తాను ముస్లీం మత విద్వేషినికానని కాకపోతే తాను తీసిన చిత్రం అంతం కాదు ఆరంభం మాత్రమేనని, మున్ముందు మరెన్నో ముస్లిం వ్యతిరేక చిత్రాలకు దర్శకత్వం వహించనున్నట్టు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











