షూటింగ్‌లో గాయపడిన 'క్యాట్ ఉమెన్' అన్నే హాత్వే
లండన్, జూన్ 1: స్టార్ హీరోయిన్ 'అన్నే హాత్వే' చిన్న చేతి గాయంతో బాధపడుతూ ప్రస్తుతం తన చేతికి జోలె ఉపయోగిస్తోంది. పోయిన వారంలో జరిగిన ఓ చిన్న యాక్సిడెంట్‌లో మణికట్టు గాయపడినట్లు తెలిపారు. 29 సంవత్సరాల వయసు కలిగిన అన్నే హాత్వే ప్రస్తుతం 'లెస్ మిసరబల్స్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
అసలు తన చేతికి గాయం అవ్వడానికి గల కారణాలను విశ్లేషిస్తూ ఇటీవల తాను పోషంచిన క్యాట్ ఉమెన్ పాత్ర తనని అనారోగ్యానికి గురి చేసిందని తెలిపింది. క్యాట్ ఉమెన్ అనే పాత్ర ది డార్క్ నైట్ రైజెస్ అనే సినిమాలోనిది. గతంలో విడుదలై బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించిన 'బ్యాట్ మ్యాన్' సినిమాకు కొనసాగింపు చిత్రం ఇది. గతంలో ఈ పాత్రను క్రిస్టోఫర్ నోలన్ పోషించగా.. ప్రస్తుతం ఈ విలన్ పాత్రని అన్నే హాత్వే పోషిస్తున్నారు.
క్యాట్ ఉమెన్ పాత్రని మొదట నేను గ్రహించ లేదు - ఇప్పుడు నాకు కొద్దిగా చీదరమైన భావన వచ్చిందని భావిస్తున్నాను. ఈ పాత్ర చాలా ఒత్తిడితో కూడుకున్నదని అన్నారు. ఈ పాత్ర కోసం ఆరోగ్యంగా ఉండేందుకు గాను ప్రతి రోజు జిమ్‌లో ఎక్కవ సేపు కష్టపాడల్సి వచ్చేది.. ఇందుకు కారణం క్యాట్ ఉమన్ యొక్క ప్రపంచం నిజానికి మితమైనదని అన్నారు.


Click it and Unblock the Notifications











