'నగ్న చిత్రం'తో ఇంటికి దూరమైన ఇరానీ హీరోయిన్
ఇరానియన్ స్టార్ హీరోయిన్ గోషిప్టె ఫర్హానీ ఒక ఫోటోషూట్‌లో నగ్నంగా కనిపించినందుకు గాను తన మాతృ దేశం ఇరాన్‌కి రాకుండా నిషేధించారు. ఇక వివరాల్లోకి వెళితే ఇటీవల ఓ ఫ్రెంచ్ న్యూస్ మ్యాగజైన్ 'మేడం లే ఫిగారామ్' కవర్ పేజిపై నగ్నంగా దర్శనమిచ్చారు. ఈ విషయం తెలిసిన ఇరాన్ గవర్నమెంట్ ఆఫీసియల్స్ కోపేద్రేక్తులై ఫర్హానీని ఇరాన్‌కు రాకుండా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్బంలో 28 సంవత్సరాల వయసు కలిగిన ఫర్హానీ మాట్లాడుతూ నేను ఆర్టిస్ట్‌ని అవ్వడం వల్ల ఎక్కడో ఉన్న మ్యాగజైన్ ప్రతినిధుల కొరిక మేరకు కళాత్మక సేవలను అందిస్తున్నానని సంస్కృతి మరియు ఇస్లామిక్ గైడ్ అధికారిక మంత్రిత్వ శాఖకు తెలియజేశానని అన్నారు. పారిస్ పత్రికలో ప్రచురించిన కధనం ప్రకారం ఫర్హానీ గతయేడాది ఇరాన్‌ని వదిలి పెట్టి పారిస్‌కు రావడం జరిగింది.
ఫర్హానీ నటించిన 'ఎ సపరేషన్' అనే సినిమా ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ విదేశీ చిత్రం వర్గం క్రింద నామినేట్ అవ్వడం జరిగింది. ఈ సినిమా ఉత్తమ విదేశీ చిత్రం వర్గం క్రింద ఇటీవల జరిగిన గోల్టెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











