మళ్లీ తిరిగి సినిమాలలో నటించేందుకు సిద్దమైన 'డెమి'
లాస్ ఏంజిల్స్: మోడల్‌గా జీవితాన్ని ప్రారంభించి హాలీవుడ్‌లో హీరోయిన్, ఫిల్మ్ డైరెక్టర్, సాంగ్ రైటర్ లాంటి స్దానాలకు చేరుకున్న స్టార్ హీరోయిన్ డెమి మోరి. యూరప్‌లో స్కూల్ రోజుల్లోనే మోడల్‌గా కెరియర్‌ని మొదలుపెట్టిన డెమి మోరి 1980లో 'Oui' అనే మ్యాగజైన్ కవర్ పేజి కోసం నగ్నంగా ఫోజులిచ్చింది. ఆ తర్వాత 1981లో జనరల్ హాస్పిటల్ సినిమా హాలీవుడ్ లోకి ప్రవేశించిన డెమి మోరికి 1990లో 'ఘోస్ట్' సినిమా ద్వారా పేరు ప్రఖ్యాతులు రావడంతో... ఆ తర్వాత తన కెరియర్‌లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది.
డెమి మోరిలో 'మోరి' అనే పదం తన మొదటి భర్త ఫ్రీడీ మోరి ద్వారా చేర్చుకుంది. ఆ తర్వాత తన భర్తకు విడాకులు ఇవ్వడం.. రెండవ పెళ్లి చేసుకోవడం చక చకా జరిగిపోయాయి. తన రెండవ భర్త బ్రూస్ విల్లిస్ ద్వారా ముగ్గురు అమ్మాయిలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత రెండో భర్తకు విడాకులు ఇవ్వడం.. మళ్లీ మూడవ భర్తగా హాలీవుడ్ హీరో ఆస్టన్ కుచర్ ని ప్రేమించి 2005లో పెళ్లి చేసుకోవడం.. కొన్ని అనుకోని పరిస్దితుల వల్ల వీరిద్దరూ నవంబర్ 2011లో విడాకులు తీసుకున్నారు.
ఇటీవల మెడికల్ ఎమర్జెన్సీ సంభవించడంతో తన సినీ కెరియర్‌కు పుల్ స్టాప్ పెట్టిన డెమి మోరి మళ్లీ తిరిగి సినిమాలలో నటించేందుకు ఒప్పందం చేసుకున్నారు. 49 సంవత్సరాల వయసు కలిగిన డెమి మోరి 'వెరీ గుడ్ గర్ల్స్' అనే సినిమా నటిస్తున్నారు. ఈ సినిమాలో డెమి మోరితో పాటు కాలిఫోర్నియా స్కూల్ స్నేహితులు ఎలిజబెత్ ఓల్సన్, డకోటా ఫాన్నింగ్ నటిస్తున్నారు.
ఈ సినిమాలో ఎలిజబెత్ ఓల్సన్ తల్లిగా డెమి మోరి నటిస్తున్నారు. డెమి మోరి చివరిసారిగా నటించిన చిత్రం 'లవ్లేస్'. జనవరిలో ఈ సినిమా నటించిన తర్వాత డెమి మోరి తన ఇంట్లో కళ్లు తిరిగి పడిపోయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











