తెర వెనకు ఉండి పని చేయడం సంతోషంగా ఉంది
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇవా లంగోరియా త్వరలో నిర్మాతగా ఆమె అనుభవాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి చాలా ఉత్సాహంగా ఉంది. ఇప్పటి వరకు కెమెరా ముందు కనిపించిన నేను ఇక ముందు కెమెరా వెనుక పాత్రను పోషించనున్నట్లు తెలిపింది. ఈ సందర్బంలో ఓ ప్రముఖ టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఇవా లంగోరియా మాట్లాడుతూ నేను తెర వెనుకని ఎంతగానో ప్రేమిస్తున్నాను.
ఇందుకు కారణం నాకు సినిమా ప్రొడ్యూస్ అంటే చాలా ఇష్టం. దానికి కావాల్సిన బలమైన వ్యాపార మనస్సు కలిగి ఉన్నాను. ఇలాంటి సృజనాత్మక ప్రక్రియ ఇష్టం అని అన్నారు. ఇక సినిమా నిర్మాణానికి, సినిమా యాక్టింగ్‌కు మధ్య గల తేడాలు ఏంటి అన్న ప్రశ్నకు గాను.. ఇవా లంగోరియా యాక్టర్ గా ఒక్క ఫెర్పామెన్స్‌ని మాత్రమే కంట్రోల్ చేయవచ్చు. అదే సినిమా ప్రోడ్యూసర్ ఐతే ఎడిట్, డైరెక్ట్, కొత్త సెట్‌లను నిర్మించడం ఇలా మనకు నచ్చిన ప్రతి పని మన చేతిలోనే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని కంట్రోల్స్ మన చేతిలోనే ఉంటాయి.
ఒక నిర్మాతగా నా నియంత్రణలో చాలా ఉన్నాయి కాబట్టి నేను నియంత్రణ చాపల్యమునకు రెడీ అని అన్నారు. నిజంగా కెమెరా వెనుక ఉంటూ ఆనందించండం చాలా సంతోషంగా ఉందని ఇవా లంగోరియా తెలిపారు.


Click it and Unblock the Notifications











