నా అనుమతి లేకుండా ఫోటోలు ఉపయోగించినందుకే దావా
స్టార్ హీరోయిన్ 'హిల్లరీ స్వాంక్' తన అనుమతి లేకుండా తన ఇమేజిలను ఉపయోగించుకుంటున్న హోం ఆడియా కంపెనీలపై దావా వేశారు. ఇక వివరాల్లోకి వెళితే మే 10వ తారీఖున 'హిల్లరీ స్వాంక్' లాస్ ఏంజిల్స్ కోర్టులో రాబర్ట్స్ హోం ఆడియో కంపెనీని నిర్వహిస్తున్న యజమాని రండెల్ కోర్డియోలతో పాటు కోర్డిరో స్టూడియోస్ లపై తన అనుమతి లేకుండా తన పేరు, ఇమేజిలను కంపెనీ యాడ్స్ కోసం ఉపయోగిస్తున్నారంటూ దావా వేశారు.
కంప్లైంట్ లో ఉన్న దాని ప్రకారం: ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వారు హిల్లరీ స్వాంక్ ని సంప్రదించకుండా ఆమె ఫోటోలను ఎడ్వర్టైజ్ మెంట్స్, కమర్షియల్ ఉత్పత్తుల కోసం ఉపయోగించుకుంటున్నారు. హిల్లరీ స్వాంక్ కు సంబంధించి ఎటువంటి పోటోలను హోం ఆడియో కంపెనీలు వినియోగిస్తున్నారో వాటికి సంబంధించిన డిటేల్స్ ని మాత్రం వెల్లిడించ లేదు.
ఆస్కార్ విజేత అయినటువంటి హిల్లరీ స్వాంక్ ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉన్నారని అందుకే హోం ఆడియో కంపెనీలపై దావా వేసే స్దాయికి వెళ్లారని ఆమె తరుపున న్యాయవాది తెలిపారు.


Click it and Unblock the Notifications











