డేటింగ్ కాస్త ముదిరి ఎంగేజ్ దాకా వచ్చింది
లాస్ ఏంజిల్స్: 2011 నుండి డేటింగ్‌లో మునిగి తేలుతున్న జంట పుట్టిన రోజు నాడు ఒకటైంది. ఎవరా ఆ జంట అని అనుకుంటున్నారా... హాలీవుడ్ హీరోయిన్ జెన్నిఫర్ ఆనిస్టన్, ఆమె బాయ్ ప్రెండ్ జస్టిన్ థ్రాక్స్. 43 సంవత్సరాల వయసు కలిగిన మాజీ ప్రెండ్స్ స్టార్ హీరోయిన్ అయిన జెన్నిఫర్ ఆనిస్టన్‌కు, జస్టిన్ థ్రాక్స్ తన 41వ పుట్టిన రోజు (శుక్రవారం) నాడు తనని వివాహం చేసుకోవాలంటూ ప్రపోజ్ చేశాడు.
ఈ సడన్ సర్‌ప్రైజ్‌ని ఊహించని జెన్నిఫర్ ఆనిస్టన్ కూడా ఓకె చెప్పేసిందని సమాచారం. జస్టిన్ థ్రాక్స్ అధికార ప్రతినిధి మాట్లడుతూ శుక్రవారం నాడు జస్టిన్ థ్రాక్స్‌కు అధ్బుతమైన పుట్టిన రోజు కానుక లభించింది, ఆ పుట్టిన రోజు కానుక ఏమిటంటే తన ప్రియురాలు జెన్నిఫర్ ఆనిస్టన్ తన కోరికకు అంగీకారం తేలుపడమేనని అన్నాడు. దీంతో వీరిద్దరూ ఎంగేజ్ అయ్యారు. ఐతే ఇటీవల కాలంలో వీరిద్దరూ కొన్ని మనస్పర్దల కారణంగా విడిపోయారంటూ వార్తలు వచ్చిన తర్వాత జస్టిన్ థ్రాక్స్ అధికార ప్రతినిధి వీరిద్దరూ ఎంగేజ్ అయినట్లు ప్రకటించడం అభినందనీయం.
జస్టిన్ థ్రాక్స్‌కు ఇదే మొదటి మ్యారేజి కాగా, జెన్నిఫర్ ఆనిస్టన్ మాత్రం గతంలో హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్‌ని వివాహాం చేసుకోని నాలుగు సంవత్సరాలు కలిసి జీవించిన తర్వాత 2005లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత జెన్నిఫర్ ఆనిస్టన్ కొంత కాలంగా ఒంటరిగా జీవించినప్పటికీ.. మగతోడుకి అలవాటు పడ్డ జెన్నిఫర్ ఆనిస్టన్ జస్టిన్ థ్రాక్స్‌తో డేటింగ్ చేస్తుంది. ఇక బ్రాడ్ పిట్ విషయానికి వస్తే హీరోయిన్ ఏంజిలీనా జోలీని త్వరలో వివాహం చేసుకోనున్నాడు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











