జెన్నిఫర్ అందమైన నటంటున్న అలనాటి అందాల హీరోయిన్
లండన్: 73 సంవత్సరాల వయసు కలిగిన అలనాటి అందాల హీరోయిన్ జేన్ ఫోండా మాట్లాడుతూ తన జీవితంలో తాను కలిసిన అందమైన హీరోయిన్లలలో జెన్నిఫర్ లోపెజ్ ఒకరని తెలిపారు. అమెరికాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టాలెంట్ షో 'అమెరికన్ ఐడల్' జడ్జిగా జెన్నిఫర్ లోపెజ్ వ్యవహారిస్తున్న తీరు అధ్బుతం అని కొనియాడారు.
జెన్నిఫర్ లోపెజ్‌ని చూడడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. నిజంగా జెన్నీఫర్ చాలా అందంగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం జెన్నిఫర్ లోపెజ్ సింగింగ్ టాలెంట్ షో అయిన 'ది ఎక్స్ ప్యాక్టర్' జడ్జిగా ఉన్నారు. ఇక ఇటీవల ప్రముఖ ఫోర్బ్స్ పత్రిక బుధవారం విడుదల జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సెలబ్రటీగా మొదటి స్దానాన్ని జెన్నిఫర్ లోపెజ్ కైవసం చేసుకోగా.. రెండవ స్దానాన్ని అమెరికా టెలివిజన్ రాణి ఓప్రా విన్ఫ్రే సొంతం చేసుకుందని ప్రచురించింది. గతయేడాది ఇదే ఫోర్బ్స్ పత్రిక అత్యంత శక్తివంతమైన సెలబ్రటీగా లేడిగాగాని అభివర్ణించిన సంగతి తెలిసిందే.
గతయేడాది ఫోర్బ్స్ పత్రిక సినిమా, టివి, మ్యూజిక్, క్రీడా రంగాలకు సంబంధించి టాప్ 100 అత్యంత శక్తివంతమైన సెలబ్రటీల ర్యాంకింగ్స్ జెన్నిఫర్ లోపెజ్ 50వ స్దానాన్ని కైవసం చేసుకోగా.. ఈ ఏడాది జెన్నిఫర్ విడుదల చేసిన 'లెట్స్ గెట్ లౌడ్', 'లవ్ డోన్ట్ కాస్ట్ ఎ థింగ్' ఆల్బమ్‌లు ఒక్కసారిగా జెన్నిఫర్‌ని మొదటి స్దానంలో కూర్బోబెట్టాయి.


Click it and Unblock the Notifications











