భర్త పరువు పోయే విధంగా ప్రవర్తించినందుకు క్షమాపణ
న్యూయార్క్: హాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్యాటీ హాల్మస్ తన మాజీ భర్త టామ్ క్రూయిజ్ నుండి బహిరంగంగా విడాకులు కోరుతూ కోర్టులో దాఖలు చేయడం వల్ల టామ్ క్రూయిజ్ అవమానకరకంగా భావించడంతో అతనిని క్షమాపణ కోరింది. ఇటీవల జరిగిన వదంతంపై క్యాటీ హాల్మస్ తన మాజీ భర్త టామ్ క్రూయిజ్‌ని క్షమాపణ కోరిందని.. విడాకులు కోరిన పద్దతి సరైన విధంగా లేదని తాను ఎంతో బాధ పడిందని క్యాటీ హాల్మస్ సన్నిహితుడు ఒకరు తెలిపారు.
33 సంవత్సరాల వయసు కలిగిన క్యాటీ హాల్మస్ ఐదు సంవత్సరాలు టామ్ క్రూయిజ్‌తో కలిసి జీవించిన తర్వాత గత నెలలో విడాకులు కోరుతూ న్యూ యార్క్ కోర్టులో పైలు దాఖలు చేసింది. పైలు దాఖలు చేసిన కొన్ని వారాలలోపే వీరిద్దరికి విడాకులు లభించాయి. టామ్ క్రూయిజ్, క్యాటీ హాల్మస్‌ల మద్దుల కూతురుని సూరి క్రూయిజ్‌ని తన తల్లి సంరక్షణలో పెరగనిస్తూ.. తండ్రికి అప్పుడప్పుడూ వచ్చి చూసిపోయే వెసులుబాటు కోర్టు కల్పించింది. సూరి క్రూయిజ్ వయసు 6 సంవత్సరాలు.
ఐతే టూమ్ క్రూయిజ్ తన కూతురు సూరి క్రూయిజ్ మనసు దోచేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నప్పటికీ.. క్యాటీ హాల్మస్ మాత్రం అందుకు సమ్మతించడం లేదు. ప్రస్తుతం బిజీ షెడ్యూల్స్ వల్ల సూరి క్రూయిజ్‌ని టామ్ కూడా నిర్లక్ష్యం చేయడం క్యాటీ హాల్మస్‌కు కలసి వచ్చే అంశం. ఐతే ఇటీవల టామ్ క్రూయిజ్ ప్రతినిధి తెలిపిన సమాచారం ప్రకారం తనకున్న పలుకుబడిని అంతటిని ఉపయోగించి తన కూతురుని ఎలాగైనా సరే తన వద్దకు తీసుకురావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇందుకోసం గాను క్యాటీ హాల్మస్‌పై లీగల్ కస్టడీ ద్వారా పోరు చేసేందుకు సన్నద్దమైనట్లు సమాచారం. ప్రస్తుతం టామ్ క్రూయిజ్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. దీని వల్ల తన కూతురు సూరి క్రూయిజ్‌తో ఎక్కవ సమయం గడపలేక పోతున్నాడు. త్వరితగతిన తన చేతినిండా ఉన్న సినిమాలను పూర్తి చేసి తన కూతురితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నాడు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











