Don't Miss!
- News ఇండి కూటమికి ఓటేస్తే మీ సంపద, ఆస్తులు దోచేస్తారు: కాంగ్రెస్‌పై మోడీ విసుర్లు
- Sports RR vs MI: అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
బాక్సాఫీసు హిట్ సీక్వెల్ నుండి ఆమెను తప్పించారు..
లాస్ ఏంజిల్స్: ఇటీవల హాలీవుడ్లో బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించిన 'స్నో వైట్ అండ్ ద హాంట్స్ మ్యాన్' సినిమాలో హీరోయిన్గా నటించిన క్రిస్టినా స్టివార్ట్ తదుపరి సీక్వెల్లో హీరోయిన్గా నటించడం లేదు. కారణం దీని తదుపరి భాగంలో సినిమా మొత్తం హాంట్స్ మ్యాన్ ఆధారంగా తీయనున్నారు. దీంతో స్నో వైట్ పాత్రని పూర్తిగా కట్ చేయనున్నారు. మొదటి పార్ట్‌లో క్రిస్టినా స్టివార్ట్ స్నో వైట్‌గా నటించిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాని యూనివర్సల్ పతాకంపై నిర్మిస్తున్నారు. మొదటి పార్ట్‌కు దర్శకత్వం వహించిన రూపెర్ట్ సాండర్స్ దర్శకత్వం వహిస్తారా లేదా అనేది ఇంకా నిర్దారణ కాలేదు. ఐతే ఈ సినిమాకి దర్శకత్వం వహించడానికి గాను ఎంపిక చేసిన దర్శకులలో రూపెర్ట్ సాండర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు. యూనివర్సల్ స్టూడియో అధికార ప్రతనిధి తెలిపిన దాని ప్రకారం 'స్నో వైట్ అండ్ ద హాంట్స్ మ్యాన్' మొదటి పార్ట్ బాగా లాభాలను తెచ్చి పెట్టడంతో తదుపరి సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
22 సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టినా స్టివార్ట్ మూడు సంవత్సరాలు ఎంతగానో ప్రేమించి డేటింగ్ చేసిన తన ప్రియుడు హాలీవుడ్ అందగాడు రాబర్ట్ ప్యాటిన్సన్ను మోసం చేసి 'స్నో వైట్ అండ్ ద హాంట్స్ మ్యాన్' దర్శకుడు రూపెర్ట్ సాండర్స్తో రొమాన్స్ చేసింది. దీంతో వీరిద్దరూ విడిపోయారు. అంతేకాకుండా క్రిస్టినా స్టివార్ట్ త్వరలో నటించనున్న 'కాలి' అనే సినిమా నుండి తీసివేసినట్లు గత వారంలో రూమర్స్ వచ్చాయి.
రాబర్ట్ ప్యాటిన్సన్ నుండి విడిపోయిన తర్వాత క్రిస్టినా స్టివార్ట్ సినిమాలను ఇలా కోల్పోతుంటే, రాబర్ట్ ప్యాటిన్సన్ మాత్రం కొత్తగా నటించిన 'కాస్మో పోలీస్' సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు.
తెలుగు వన్ఇండియా