షూటింగ్ స్పాట్‌లో గాయపడిన దేవకన్య క్రిస్టినా స్టివార్ట్

By Nageswara Rao

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ దేవకన్య క్రిస్టినా స్టివార్ట్ హీరోయిన్‌గా 'ద ట్విలైట్ సాగా: బ్రేకింగ్ డాన్ - పార్ట్ 2' చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. గతంలో నటించిన ట్విలైట్ సిరిస్‌లలో క్రిస్టినా స్టివార్ట్ రక్త పిశాచి బెల్లా స్వాన్ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంలో కూడా క్రిస్టినా స్టివార్ట్ బెల్లా స్వాన్ పాత్రను పోషిస్తున్నారు.

ఐతే ఓ సీన్‌లో భాగంగా క్రిస్టినా స్టివార్ట్ వేటకు వెళ్తుంది. వేటలో అనుకోకుండా క్రిస్టినా స్టివార్ట్ ఈ చిత్రం షూటింగ్‌లో గాయపడిందని యూనిట్ సభ్యులు పేర్కోన్నారు. ఈ సందర్బంలో క్రిస్టినా స్టివార్ట్ మాట్లాడుతూ మొదటి సీన్ వేటకు సంబంధించిన సీన్ ఎంతో ముఖ్యమైంది. ఆ సీన్‌ బాగా రావాలనే ఉద్దేశ్యంతో యూనిట్ సభ్యులందరూ ఎక్కువ కష్టపడ్డాం. అనుకోకుండా గాయపడ్డానని క్రిస్టినా స్టివార్ట్ తెలిపింది. ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం నవంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

దీనితో పాటు క్రిస్టనా స్టివార్ట్ యాక్షన్, ఎడ్వెంచర్ సినిమా "Cali" లో మ్యా అనే పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో ఈ పాత్ర ఎక్కువగా సెక్స్, డ్రగ్స్, హాత్యలకు సంబంధించిన కార్యకలాపాలను సాగించే విధంగా ఉంటుంది.

ఈ సినిమా నిర్మాత గ్రెగ్ జె ఫ్లోర్ మాట్లాడుతూ ఈ సినిమాలో క్రిస్టనా స్టివార్ట్ రెండవ వైపు నటనా విశ్వరూపాన్ని చూస్తారని అన్నారు. క్రిస్టనా స్టివార్ట్ ఎంతో అద్బుతమైన నటన ప్రదర్శిస్తుందని కొనియాడారు. గతంలో ఆమె హీరోయిన్‌గా నటించిన 'ట్విలైట్ ద బ్రేకింగ్ డాన్ పార్ట్ 1' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.

"Cali" సినిమాలో క్రిస్టనా స్టివార్ట్ ఇంత వరకు తన జీవితంలో చేయనటువంటి సెక్సీ రోల్‌ని చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా క్రిస్టనా స్టివార్ట్ల్ నటనలో కొత్త కోణాన్ని చూస్తామన్నారు. ఈ సినిమాకు కథని మైఖేల్ డిల్ బెర్తీ అందించగా.. ఫ్లోర్, జివ్ ఫోరేమన్ సహా నిర్మాతలుగా వ్వవహరించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X