twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కూతురు చేసిన తప్పుకి తల్లిదండ్రులు విడిపోతున్నారు..!

    By Nageswara Rao
    |

    లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రిస్టినా స్టివార్ట్ తల్లిదండ్రులు విడాకులు తీసుకోబోతున్నారు. క్రిస్టినా స్టువర్ట్ తల్లి జూల్స్ స్టివర్ట్ తన భర్త జాన్ స్టువర్ట్ నుండి విడాకులు కోరుతూ పిటిషన్‌ని వేసింది. జాన్ స్టివర్ట్, జూల్స్ స్టివర్ట్‌ల పెళ్లి జరిగి దాదాపు 27 సంవత్సరాలు పూర్తైంది. క్రిస్టినా స్టివర్ట్ తల్లి జూల్స్ స్టివర్ట్ కంట్రీ సుపీరియర్ కోర్టులో ఫైల్ చేసిన పేపర్స్‌లో అభిప్రాయ బేధాలు రావడం వల్లనే తన భర్త నుండి విడాకులు కోరుతున్నట్లు పేర్కొంది.

    క్రిస్టినా స్టివార్ట్ బాయ్ ప్రెండ్ రాబర్ట్ ప్యాటిన్సన్‌ మోసం చేసి తాను హీరోయిన్‌గా నటించిన 'స్నో వైట్ అండ్ ద హాంట్స్ మ్యాన్' డైరెక్టర్‌తో రోమాన్స్ చేయడం తన తల్లికి నచ్చకపోవడం వల్లనే ఎటువంటి లాయర్ సహాయం పొందకుండా తనంతట తానే నేరుగా వెళ్లి కోర్టులో విడాకులు కోరుతూ ఫైల్ దాఖలు చేసింది.

    జూల్స్ స్టివార్ట్ హాలీవుడ్ నిర్మాణ సంస్ద ఫాక్స్‌లో రచయిత, డైరెక్టర్‌గా పని చేశారు. ఇక జాన్ స్టివర్ట్ టివి ప్రోడ్యూసర్ పలు టివి సీరియల్స్‌ని నిర్మించడంతో పాటు, స్టేజి మేనేజర్‌గా పేరు ప్రఖ్యాతులు సాధించారు. ఇది ఇలా ఉంటే ఇటీవలే రాబర్ట్ ప్యాటిన్సన్ తన మాజీ గర్ల్ ఫ్రెండ్ క్రిస్టినా స్టివార్ట్‌‌తో ఫేస్ టు ఫేస్ కలిసేందుకు ఎట్టకేలకు అంగీకరించాడు. వివరాల్లోకి వెళితే 26 సంవత్సరాల వయసు కలిగిన రాబర్ట్ ప్యాటిన్సన్, క్రిస్టినా స్టివార్ట్ ఇద్దరూ 2008లో ట్విలైట్ సినిమా కలిసి నటించిన తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి అప్పటి నుండి 2012 జూన్ వరకు డేటింగ్‌లో మునిగి తేలారు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    Actress Kristen Stewart’s parents are getting divorced. Kristen’s mother, Jules Stewart, filed a divorce petition against John Stewart, who she married 27 years ago. She filed the papers at County Superior Court, here citing irreconcilable differences.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X