Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అర్ద నగ్నంగా నటించడం గర్వంగా ఉంది: క్రిస్టినా స్టివార్ట్
లండన్, జూన్ 1: హాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రిస్టినా స్టివార్ట్ రాబోయే చిత్రం 'ఆన్ ద రోడ్' లో అర్ద నగ్నంగా నటించడంపై విమర్శకులు విమర్శలను గుప్పిస్తే స్టివార్ట్ మాత్రం అర్ద నగ్నంగా నటించడాన్ని సమర్దించుకుంది. 22 సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టినా స్టివార్ట్ గతంలో ట్విలైట్ సినిమాలలో మధ్యస్త నగ్నంగా నటించినప్పుడు కూడా విమర్శకులు తనని విమర్శించారని ఐతే అటువంటి వాటిని పట్టించుకుంటే కష్టమని తేలిగ్గా కొట్టి పారేశారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో అర్ద నగ్నంగా నటించడం నాకు గర్వంగా ఉందని గత నెలలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గోనడానికి వచ్చినప్పుడు చెప్పారు. నేను పూర్తిగా అంచనా వేసినట్లే ప్రజలు నిజంగా ఊహాజనిత ఉన్నారు. ఇది కొద్దిగా ఇబ్బంది కరంగా ఉందని చెప్పలేను, కానీ ఈ అర్ద నగ్న సన్నివేశం సరైన మార్గంలో ఉందని అనుకుంటున్నాను.
సినిమాని చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు ఏమేమి అంశాలు కావాలో అవన్ని ఇందులో పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. క్రిస్టినా స్టివార్ట్ ఈ చిత్రంతో పాటు టస్నో వైట్ అండ్ ద హాంట్స్ మ్యాన్' చిత్రం కూడా విడుదలకు సిద్దమైంది. ఈ సినిమాకు బ్రిటిష్ డైరెక్టర్ రూపర్ట్ సాండర్స్ దర్శకత్వం వహించగా.. క్రిస్టినా స్టివార్ట్తో పాటు ఈ సినిమాలో ఛార్లీ థెరాన్, క్రిస్ హోమ్స్ వర్త్, సామ్ క్లాఫిన్ లాంటి మహామహులు నటించారు.
ఈ చిత్రంలో కూడా క్రిస్టినా స్టివార్ట్ బెల్లా స్వాన్ పాత్రను పోషిస్తున్నారు. ఐతే ఓ సీన్లో భాగంగా క్రిస్టినా స్టివార్ట్ వేటకు వెళ్తుంది. వేటలో అనుకోకుండా క్రిస్టినా స్టివార్ట్ ఈ చిత్రం షూటింగ్లో గాయపడిందని యూనిట్ సభ్యులు పేర్కోన్నారు.