For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయనతో కలిసి మళ్లీ నటించాలని ఉంది: క్రిస్టినా స్టివార్ట్

By Nageswara Rao
|

లండన్: హాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రిస్టినా స్టివార్ట్ తన బాయ్ ప్రెండ్ రాబర్ట్ ప్యాట్రిన్సన్‌తో కలిసి మరో సినిమా చేయాలనుందని తన మనసులోని మాటను 'స్నో వైట్ అండ్ ద హంట్స్ మ్యాన్' ప్రీమియర్ షో సందర్బంగా తెలిపింది. క్రిస్టినా స్టివార్ట్ మాట్లాడుతూ రాబర్ట్ ప్యాట్రిన్సన్‌తో మరొక సినిమా చేసందుకు తాను సిద్దంగా ఉన్నానని తెలిపింది. నా ఉద్దేశ్యం ప్రకారం మేమిద్దరం చక్కని టీమ్. సినిమాలో ఎలాంటి సన్నివేశాలనైనా మేమిద్దరం అలవోకగా చేస్తాం. అందుకే రాబ్‌తో కలిసి పని చేయడం అంటే నాకెంతో ఇష్టం అని అన్నారు.

గతంలో వీరిద్దరూ కలిసి 'ట్విలైట్' సిరిస్ సినిమాలలో నటించారు. 'స్నో వైట్ అండ్ ద హంట్స్ మ్యాన్' సినిమాలో తాను నటించిన నటనకు గాను రాబర్ట్ ప్యాట్రిన్సన్ ఎంతో ముగ్దుడయ్యాడని 22 సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టినా స్టివార్ట్ తెలిపింది. అతను ఇష్టపడ్డాడు. అతను నిజంగా చాలా ఇష్టపడ్డాడు. నిజంగా నాకు ఈ పాత్ర చేయడం చాలా గర్వంగా ఉందని తెలిపింది.

లండన్‌లో జరిగిన ఈ ప్రీమియర్‌కు క్రిస్టినా స్టివార్ట్ ఎరుపు, నలుపు రంగు కలిగిన డ్రస్సుని ధరించి వచ్చారు. క్రిస్టినా స్టివార్ట్ తన ప్రియుడు రాబర్ట్ ప్యాటిన్సన్‌తో చేస్తున్న స్నేహాం మూడు సంవత్సరాలైన సందర్బంగా 50,000 పౌండ్ల విలువ చేసే ఒక పియానో కోనుగోలు చేసి బహుమతిగా ఇచ్చింది.

క్రిస్టెన్ తన బాయ్ ప్రెండ్‌కి ఆశ్చర్యం కలిగించే బహుమతినిన ఇవ్వాలనే ఉద్దేశ్యంతో దీనిని కొనుగోలు చేసిందని క్రిస్టెన్ అధికార ప్రతినిధి తెలిపారు. తన జీవితంలో అభిమానులు, చిత్రకారులతో ఎల్లప్పుడూ పుల్ బిజీగా జీవించే రాబర్ట్ ప్యాటిన్సన్ అప్పుడప్పుడు వేరే ప్రపంచంలోకి వెళ్లేందుకు ఈ పియానోని ప్లే చేసే అలవాటుని అలవర్చుకున్నాడు.

రాబర్ట్ ప్యాటిన్సన్‌ ఒంటరిగా ఉన్న సమయంలో ఆలోచింపజేసే ఆలోచనలు, భావోద్వేగ మరియు సృజనాత్మక పొందుటకు పియానోని ప్లే చేస్తాడని సమాచారం. రాబర్ట్ ప్యాటిన్సన్‌ ఇష్టాన్ని తెలుసుకోని ధరను కూడా ఆలోచించకుండా బాయ్ ప్రెండ్ కోసం క్రిస్టినా స్టివార్ట్ ఈ బహుమతిని అందించిందని ఆమెని అభినందిస్తున్నారు.

English summary
Actress Kristen Stewart says she is desperate to work in another movie with her boyfriend Robert Pattinson.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more