పాప్ స్టార్ కొత్త వీడియో ఆల్బమ్‌లో స్టార్ హీరోయిన్

By Nageswara Rao

లండన్: హాలీవుడ్ స్టార్ హీరోయిన్ లిండ్సే లోహాన్ త్వరలో పాప్ స్టార్ లేడిగాగా రూపొందించినున్న కొత్త ఆల్బమ్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 26 సంవత్సరాల వయసు కలిగిన లిండ్సే లోహాన్ ఇటీవల హాలీవుడ్‌లో ఉన్న చాతేబు మార్మెంట్ హోటల్‌లో ఈ వీడియో ఆల్బమ్ గురించి కూలంకుషంగా చర్చించారు.

లేడిగాగా సన్నిహిత వర్గాలు ఈ వార్తను ధృవీకరించాయి. ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో లేడిగాగా అధికార ప్రతినిధి మాట్లాడుతూ లిండ్సే లోహాన్, లేడిగాగా కొత్తగా రూపొందించనున్న వీడియో ఆల్బమ్‌లో నటిస్తున్నారు. ఈ ఆల్బమ్ పేరు "Artpop". ఐతే ఈ ఆల్బమ్‌లో లిండ్సే లోహాన్ ఏ పాటలో నటించనుందనే విషయం మాత్రం వెల్లడించలేదు.

దీనితో పాటు లిండ్సే లోహాన్ హాలీవుడ్ రచయిత బ్రెట్ ఈస్టన్ ఎల్లిస్ రచించినటువంటి థ్రిల్లర్ సినిమా 'ది కాన్యోన్స్' సినిమాలో ఆడల్ట్ ఫిల్మ్ స్టార్ జేమ్స్ డీన్ సరసన నటించేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని రచయిత బ్రెట్ ఈస్టన్ ఎల్లిస్ తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమాలో నటించే తారాగణాన్ని ట్వీట్ చేశాడు. లిండ్సే లోహాన్ ప్రస్తుతం 'ది కాన్యోన్స్' చిత్రం షూటింగ్‌లో పాల్గోంటున్నారు.

తెలుగు వన్ఇండియా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X