4 రోజులు నుండి 85 గంటలపాటు షూటింగ్ వల్లే స్పృహ తప్పాను
లాస్ ఏంజిల్స్, జూన్ 17: హాలీవుడ్ స్టార్ హీరోయిన్, సెక్సీ తార లిండ్సే లోహాన్ కాలిఫోర్నియాలోని మెరినా డెల్ రే ప్రాంతంలో ఉన్న రిట్జ్-కార్ల్టన్ హోటల్‌లోని తన గదిలో కొంతసేపు స్పృహ తప్పారని సమాచారం. గత కొన్ని రోజులుగా లిండ్సే లోహాన్ 'లిజ్ అండ్ డిక్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్ల నిద్రలేమి, డీహైడ్రేషన్, అలసటతోనే అలా జరిగిందని తెలిపారు.
'ఈ' వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం.. లిండ్సే శుక్రవారం రాత్రి ఏడు నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు ఏకధాటిగా షూటింగ్‌లో ఉన్నారు. దీంతో అలసటకు గురై హోటల్ గదిలో స్పృహ కోల్పోయారని ప్రచురించింది. ఆమె పరిస్థితిని గమనించిన లిజ్ అండ్ డిక్ సినిమా బృందంలోని సభ్యులు 911కి ఫోన్ చేయగా.. లిండ్సేను పరీక్షించిన వైద్యులు ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యా లేదని తేల్చారు. ఈ విషయాన్ని లిండ్సే లోహాన్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
లిండ్సే లోహాన్ ప్రస్తుతం బాగానే ఉందని, తిరిగి 'లిజ్ అండ్ డిక్' షూటింగ్‌లో పాల్గొంటోందని ఆమె తల్లి డినా చెప్పారు. ప్రఖ్యాత హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో లిండ్సే లోహాన్ లీడ్ రోల్‌ని పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం గాను లిండ్సే లోహాన్ గత నాలుగు రోజులుగా ఏకధాటిన 85 గంటల పాటు షూటింగ్‌లో పాల్గోన్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











