పాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకే ఈ రీసెర్చ్..: నోమీ వాట్స్
లండన్, జూన్ 17: బ్రిటిష్ సామ్రాజ్యంలో ప్రిన్సెస్ డయానాది ఓ ప్రత్యేకమైన శైలి. అలాంటి ప్రిన్సెస్ డయానా జీవితాన్ని నిజ జీవితంలో తెరమీద పోషిస్తున్న హీరోయిన్ నోమి వాట్స్ తన నివాసాన్ని లండన్‌కు మార్చనుంది. బ్రిటిష్ పుట్టిన నోమీ వాట్స్ తన చిన్నతనాన్ని ఆస్టేలియాలో గడిపినప్పటికీ.. హాలీవుడ్‌లో తనదైన శైలిలో నటనను ప్రదర్శించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.
ఆలివర్ హోర్కిస్ బేగల్ దర్శకత్వంలో రానున్న సినిమా "కాట్ ఇన్ ఫ్లైట్". ప్రిన్సెస్ డయానా చనిపోవడానికి ముందు రెండు సంవత్సరాలు తన జీవితం ఎలా సాగిందో అనేది ముఖ్య కథాంశంగా సినిమా సాగుతుంది. ప్రిన్సెస్ డయానా 1997లో ప్రాన్స్ రాజధాని పారిస్ లో కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.
ప్రిన్సెస్ డయానా పాత్రని పోషించడం చాలెంజింగ్‌గా తీసుకున్న నోమీ వాట్స్ డయానా గురించి పూర్తి విషయాలను తెలుసుకునేందుకు గాను కెన్సింగ్టన్ అనే ప్రాంతానికి తన నివాసాన్ని మార్చింది. గతంలో ప్రిన్సెస్ డయానా బ్రతికున్న రోజుల్లో ఇదే కెన్సింగ్టన్ ప్యాలెస్‌లో జీవించింది. నోమీ వాట్స్ వీటితో పాటు డయానాకు ఇష్టమైన హార్బర్ క్లబ్, బ్యూచామ్ప్ ప్లేస్ సందర్శించడంతో పాటు వాటి గురించి పూర్తి సమాచారాన్ని సేకరించింది.
ఇంత పకడ్బందీగా నోమీ వాట్స్ తెలుసుకోవడానికి గల కారణం ప్రిన్సెస్ డయానా ప్రపంచంలో అత్యున్నత హై ప్రొపైల్ కలిగిన వ్యక్తి కావడమే. త్వరలో షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే నోమీ వాట్స్ ఈ పాత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకోని షూటింగ్‌లో పాల్గోనేందుకు సిద్దమైంది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











