twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాత్రికి రాత్రి హుటాహటిన హాస్పిటల్‌కు చేరిన హీరోయిన్

    By Nageswara Rao
    |

    లాస్ ఏంజిల్స్: ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉన్న హాలీవుడ్ స్టార్ హీరోయిన్ రీసివితర్ స్పూన్ అనుకోకుండా కొన్ని ఇబ్బందుల వల్ల శుక్రవారం రాత్రి హుటాహుటిని హాస్పిటల్‌కు వెళ్లారు. డాక్టర్లు రీసివితర్ స్పూన్‌కి టెస్టులు చేసి ఆ తర్వాత రాత్రికి రాత్రే ఇంటికి పంపి వేశారు. ఐతే మళ్లీ బుధవారం కూడా ఆమె హాస్పిటల్‌కు రావడంతో ఆమె అభిమానులు ఒకింత కంగారు పడ్డారు. రీసివితర్ స్పూన్ ప్రస్తుతం మూడవ బిడ్డకు జన్మనిస్తుంది.

    తొలిసారి బిడ్డకు జన్మనిస్తుండడం వల్ల రీసివితర్ స్పూన్ ఆమె భార్య జిమ్ టోత్ ఇద్దరూ కంగారుపడుతున్నారని డాక్టర్లు రీసివితర్ స్పూన్ ప్రసవించే పాపాయి పొట్టలో క్షేమంగానే ఉందని.. డెలివరీ సమయం సెప్టెంబర్ మొదటి వారంలో ఉంటుందని హాస్పిటల్ నుండి డిశ్శార్జ్ చేశారు. హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన తర్వాత రీసివితర్ స్పూన్ క్షేమంగానే ఉన్నట్లు తెలిపింది. ప్రెగ్నెంట్‌‌గా ఉన్న రీసివితర్ స్పూన్‌ను ఈ ప్రక్క చిత్రంలో చూడొచ్చు.

    36 సంవత్సరాల వయసు కలిగిన రీసివితర్ స్పూన్‌, ఆమె భార్య జిమ్ టోత్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎటువంటి మేకప్ లేకుండా బ్లాక్ ఫ్రాక్ ధరించి, తలపై కూలింగ్ గ్లాసెస్‌తో సహాజంగా ఉన్నారు. ప్రస్తుతం రీసివితర్ స్పూన్ ఖాలీగా ఉంటూ సమయాన్ని భర్త జిమ్ టోత్‌తో పాటు తన ఇద్దరు పిల్లలతో గడుపుతుంది. కూతురు అవాకి 12 సంవత్సరాలు, కొడుకు డీకాన్‌. వీళ్లిద్దరూ తన మాజీ భర్త రేయన్ ఫిలిప్పీ‌కి తనకి పుట్టిన పిల్లలు.

    ప్రస్తుతం రీసివితర్ స్పూన్ జన్మనివ్వనున్న మూడవ పాపాయికి టాలెంట్ ఏజెంట్ అయిన జిమ్ టోత్ తండ్రి అవ్వనున్నాడు. వీరిద్దరూ గత మార్చిలో పెళ్లి చేసుకున్నారు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    Actress Reese Witherspoon, who is expecting her first child, has been taken to the hospital twice within two days following certain complications.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X