twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అరుదైన గౌరవాన్ని అందుకోనున్న ఆస్కార్ విజేత

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఆస్కార్ అవార్డు గ్రహీత సాంద్రా బుల్లక్ తాను చేసిన దాతృత్వ కార్యక్రమాలకు గాను ఆమెని సన్మానించనున్నారు. వారెన్ ఈసన్ చార్టర్ హైస్కూల్‌తో పాటు.. 2005వ సంవత్సరంలో హరికేన్ కత్రినా నాశనానికిగాను ఆమె అందించిన విరాళాలను దృష్టిలో పెట్టుకోని 2012వ సంవత్సరానికి 'వారెన్ ఈసన్ హాల్ ఆప్ ఫేమ్' గా సాంద్రా బుల్లక్ ఎంపిక చేయబడింది.

    సహజ విపత్తు సంభవించినప్పటి నుండి సాంద్రా బుల్లక్ విద్యా స్థాపనతో చురుగ్గా పాల్గోని స్వచ్ఛంద ప్రాజెక్టులలో తన వంతు సహాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం సాంద్రా బుల్లక్ విద్యా సంస్దలకు గాను స్కాలర్ షిప్‌ల నిమిత్తం $25,000 విరాళంగా అందించారు. 20వ వార్షిక హాల్ ఆఫ్ ఫేమ్ వేడుకలు మే 18వ తారీఖున ఈసన్ ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

    సాంద్రా బుల్లక్ ఇలా తాను సంపాదించిన దానిలో కొద్ది మొత్తంలో దాతృత్వ కార్యక్రమాలకు పంచడం ద్వారా ఆమెలో ఉన్న మానవనీయతను చాటుకుంటున్నారు. 2011వ సంవత్సరంలో భూకంప తాకిడికి అతలాకుతమైన జపాన్ కోసం సాంద్రా బుల్లక్ తన ఫ్యామిలీ సమక్షంలో $1 మిలియన్ విరాళాలను స్వచ్ఛందంగా ప్రకటించారు. సాంద్రా బుల్లక్ దాతృత్వ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకోని సాంద్రా బుల్లక్‌ని మే 18వ తారీఖున ఈసన్ ఆడిటోరియంలో ఘనంగా సన్మానించనున్నారు.

    English summary
    Actress Sandra Bullock is being honoured for her charity work. The actress has been selected to be admitted into 2012 Warren Easton Hall of Fame for her charitable donations to Warren Eason Charter High School, destroyed by hurricane Katrina in 2005.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X