ఒక్క సినిమాకు రూ.600 కోట్లు.. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నహీరోయిన్ ఎవరంటే ?
Highest Earning Actress Sandra Bullock: హాలీవుడ్ అయినా లేదా బాలీవుడ్ అయినా సినిమా పరిశ్రమలో అయినా.. హీరో కంటే హీరోయిన్ పారితోషికం తక్కువగా ఉండటం అనేది సాధారణమే. ఈ విషయంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది. హీరోయిన్స్ కంటే హీరోల రెమ్యూనరేషన్ ఎక్కువగానే ఉంటుంది. మన దగ్గర అయితే హీరోకు ఇచ్చే రెమ్యూనరేషన్ లో కేవలం పదో వంతు మాత్రమే హీరోయిన్స్ కు పారితోషకంగా ఇస్తారు. కానీ, హాలీవుడ్లో ఓ హీరోయిన్ ఏకంగా 70 మిలియన్ డాలర్ల రెమ్యూనరేషన్ తీసుకుందట. అంటే సుమారు రూ. 600 కోట్లు. ఇంతకీ అంత భారీ మొత్తం తీసుకున్న ఆ హీరోయిన్ ఎవరో ఓ లూక్కేయండి.
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. హాలీవుడ్ నటి సాండ్రా బుల్లక్ .. ఈ అమ్మడు 2023 లో విడుదలైన 'గ్రావిటీ'కి అనే హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీకి ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా రికార్డు క్రియేట్ చేసింది. పలు కథనాల ప్రకారం.. నటి సాండ్రా బుల్లక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రం గ్రావిటీలో తన పని కోసం రూ. 1.70 బిలియన్లు వసూలు చేసింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.62 బిలియన్లకు పైగా వసూలు చేసింది.

నటి సాండ్రా బుల్లక్.. గ్రావిటీ మూవీలో నటించడం కోసం భారీ మొత్తం రెమ్యూనరేషన్ తీసుకుందట. అలాగే.. ఈ సినిమా లాభాల్లో 15 శాతం వాటాను కూడా తీసుకుందట. దీనికి ఆమె 50 మిలియన్ డాలర్లు అంటే 4.25 బిలియన్ రూపాయలు పొందింది. ఈ విధంగా రెమ్యూనరేషన్ తోపాటు లాభాల వాటాతో సహా, హాలీవుడ్ నటి సాండ్రా బుల్లక్ తన ఒక సినిమా నుండి 6 బిలియన్ల వరకు వసూలు చేసుందట. దీంతో నటి సాండ్రా బుల్లక్ ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న నటిగా రికార్డు క్రియేట్ చేసింది.
అదే సమయంలో, సాండ్రా బుల్లక్‌తో పోల్చితే.. ఆమె సహనటుడు జార్జ్ క్లూనీ ఈ చిత్రంలో 35 మిలియన్ డాలర్లు (సుమారు 3 బిలియన్ రూపాయలు) సంపాదించారు. ఇది నటి మొత్తం సంపాదనలో సగం. అత్యధికంగా రెమ్యూరేషన్ తీసుకుంటున్న నటీమణుల జాబితాలో సాండ్రా బుల్లక్ అందరి కంటే చాలా ముందుంది.

ఆమె తర్వాత.. బార్బీ చిత్రంలో నటించేందుకు గాను నటి మార్గోట్ రాబీ 50 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దీంతో నటి మార్గోట్ రాబీ రెండవ స్థానంలో ఉంది. మూడవ స్థానంలో నటి కామెరాన్ డియాజ్ నిలిచింది. ఈ అమ్మడు బాడ్ టీచర్ కోసం 42 మిలియన్ డాలర్లు (3.57 బిలియన్ రూపాయలు) వసూలు చేసింది. అదే సమయంలో.. ఒక చిత్రం నుండి 1 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుంది నటి ఎలిజబెత్ టేలర్. ఈ అమ్ముడు 1963లో క్లియోపాత్రా చిత్రానికి ఈ రేంజ్ లో వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











